ఐపీఎల్ 2022లో సోమవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు కూడా 200పై చిలుకు పరుగులు చేశాడు. కానీ.. చివరికి విజయం రాజస్థాన్‌ను వరించింది. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్వయం తప్పిదాలతోనే గెలిచే మ్యాచ్‌ను పొగొట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో అనూహ్య మార్పులతో చేతుల్లోని మ్యాచ్ పోయిందని క్రికెట్ నిపుణులు సైతం అంటున్నారు. ఇదే విషయమై కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టు హెడ్ కోచ్ బ్రాండన్ మెకల్లమ్‌పై సీరియస్ అయ్యాడు.
కేకేఆర్‌కు లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ అది సరైన ఆర్డర్‌లో లేకుంటే కష్టాలు తప్పవు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో భారీ టార్గెట్ చేజ్ చేసే క్రమంలో తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఆరోన్ ఫించ్, శ్రేయస్ అయ్యర్ సూపర్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకోచ్చారు. కానీ.. ఫించ్, నితీష్ రాణా అవుట్ అయిన తర్వాత.. రస్సెల్‌ను ముందు పంపి కేకేఆర్ తొలి తప్పిందం చేసింది. అప్పటికీ కేవలం 13వ ఓవర్ మాత్రమే నడుస్తుంది. రస్సెల్ మిడిల్ ఓవర్స్ కంటే డెత్ ఓవర్స్‌లోనే బాగా ఆడతాడు. హిట్టింగ్ చేసేందుకు క్రీజ్‌లో అయ్యర్ ఉండనే ఉన్నాడు. అయినా కూడా వెంకటేశ్ అయ్యర్ లేదా షెల్డన్ జాక్సన్ ను పంపి ఉంటే బాగుండేది. శ్రేయస్ అగ్రెసివ్‌గా ఆడుతుంటే వాళ్లు స్ట్రైక్ రోటేట్ చేసేవాళ్లు. కానీ రస్సెల్ రావడం అశ్విన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్‌లో ఒక్కసారిగా రాజస్థాన్ పట్టు సాధించింది.
ఆ తర్వాత కమిన్స్ లాంటి స్టార్ ఆల్‌రౌండర్ కంటే ముందు శివమ్ మావిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపడం మరో తప్పిదం. ఇక్కడే శ్రేయస్ అయ్యర్ సహనం కోల్పోయి కోచ్ మెకల్లమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మావి, కమిన్స్ పరుగులు చేయకుండా అవుట్ అవ్వడంతో ఓటమి దాదాపు ఖారారైంది. చివర్లో ఉమేష్ యాదవ్ ఆశలు రేపినా.. అతను కూడా అవుట్ అవ్వడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 210 పరుగుల వద్ద.. లక్ష్యానికి 8 పరుగుల దూరంలో ముగిసింది. కాగా కెప్టెన్, కోచ్ మధ్య ఈ విషయంలో మొదలైన వివాదం ఎంత వరకు దారితీస్తుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: ఆరోన్ ఫించ్, ప్రసిద్ధ్ కృష్ణ మధ్య మాటల యుద్ధం
— Diving Slip (@SlipDiving) April 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.