శిఖర్ ధావన్.. అది క్రికెట్ మైదానమైనా, సోషల్ మీడియా అయినా రచ్చ చేయడంలో మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తుంటాడు. పేరుకు శిఖర్ ధావన్ అయినా.. అభిమానులు ముద్దుగా గబ్బర్ అని పిలుచుకుంటారు. పేలవ ఆటతీరుతో జాతీయ జట్టులో స్తానం కోల్పోయిన గబ్బర్.. ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ అంచనాలకు తగ్గ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. గత ఆరు సీజన్లలోనూ 470+ పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున 11 మ్యాచుల్లో 42.33 సగటుతో 381 పరుగులు చేసి, ఫ్రాంఛైజీ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. అయితే.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు ధావన్‌లో ఫుల్లు జోష్ నింపేందుకు అతనికి జిమ్ పార్టనర్‌గా మారింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా.
‘జిమ్‌లో కసరత్తులు చేయడానికి ఎవ్వరైనా ఇన్‌స్పిరేషన్ కావాలా? మేం మీ కోసం ఆ ఏర్పాటు కూడా చేశాం..’ అంటూ ప్రీతి జింటా, శిఖర్ ధావన్ కలిసి జిమ్‌లో వ్యాయమాలు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది పంజాబ్ కింగ్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఆటగాళ్లను ఎంటర్టైన్ చేయడంలో.. ప్రీతి జింటా స్టైలే వేరబ్బా’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా, “నెక్స్ట్ మ్యాచులో ధావన్ పక్కా సెంచరీ చేస్తాడని” మరొక యూజర్ కామెంట్ చేశారు. అయితే.. గతంలో ఒక సీజన్ లో ప్రీతి జింటా క్రికెటర్లను ముద్దులతో మురిపించిన విషయం అందరికి తెలిసిందే.
Need inspiration to hit the gym? 💪
We got you covered! 💯#SaddaPunjab #PunjabKings #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ #PreityZinta #ShikharDhawan @realpreityzinta @SDhawan25 pic.twitter.com/Pt173uMq1S
— Punjab Kings (@PunjabKingsIPL) May 11, 2022
ఇది కూడా చదవండి: Virat Kohli: ఇంటర్వ్యూలో కోహ్లీ బ్యాటింగ్ పై యాంకర్ సెటైర్స్! వీడియో వైరల్!
అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ధావన్, వ్యక్తిగత జీవితంలోనూ ఊహించని మలుపులు జరిగాయి. ప్రేమించి, పెళ్లి చేసుకున్న అయేషా ముఖర్జీతో గత ఏడాది విడాకులు తీసుకున్నాడు ధావన్. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్న అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లాడాడు గబ్బర్. మొదటి భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న అయేషాను ఇష్టపడిన ధావన్, ఆమెను పెళ్లాడి.. 8 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికాడు. అయితే.. అయేషా ముఖర్జీకి, ధావన్‌కి ఎక్కడ చెడింది? ఎందుకు విడాకులు తీసుకున్నారనేది ఇప్పటివరకూ తెలియరాలేదు. విడాకుల తర్వాత తన కొడుకును కలిసి ఎమోషనల్ అయిన గబ్బర్, వ్యక్తిగత జీవితంలో వచ్చిన అలజడులతో మానసికంగా కృంగిపోయాడట. ఆ సమయంలో క్రికెట్ కూడా లేకపోవడంతో డిప్రెషన్ నుంచి బయటికి వచ్చేందుకు ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెట్టాడన్నది అసలు విషయం.
Shikhar Dhawan divorce: Shikhar Dhawan and Ayesha Mukherjee divorced; India star’s wife shares emotional post ( Inside Sports) #ShikharDhawan pic.twitter.com/eRsE6KYiD4
— ROHIT TV™ (@rohittv_45) September 7, 2021
Indian cricketer Shikhar Dhawan divorces wife Ayesha Mukherjee,
9 years of married life came to an end.🤐 pic.twitter.com/DkLol72hQ3
— Mukesh Rathod (@MMSagar_) September 7, 2021