ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో మనందరకి తెలుసు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200 పైచిలుకు పరుగులు చేయగా.. లక్నో సైతం ఒకానొక సమయంలో లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. చివరికి 14 పరుగుల తేడాతో బెంగుళూరు జట్టు విజయం సాధించిందనుకోండి. ఇదంతా ఒకవైపు జరిగితే.. మరోవైపు బెట్టింగ్ ముఠా తన పని తాను కానిచ్చింది. ఈ మ్యాచ్‌కు క్రికెట్ బెట్టింగ్ ముఠా హాజరైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బిహార్‌కు చెందిన సునీల్ కుమార్, అజయ్ కుమార్, అమర్ కుమార్, ఒబేదా ఖలీల్, అనికెత్ కుమార్‌లు అందరి ప్రేక్షకుల్లానే మ్యాచుకు హాజరయ్యాయారు. స్టేడియంలోని ఎఫ్-1 బ్లాక్‌లో ఎవరికి అనుమానం రాకుండా సామాన్య ప్రేక్షకుల్లాగా వచ్చి మ్యాచ్ చూడకుండా మొబైల్ ఫోన్స్‌లో మునిగిపోయారు. వికెట్ పడ్డా.. సిక్సర్, ఫోర్ కొట్టినా స్టేడియంలో ప్రేక్షకులు నానా హంగామా చేస్తారు. కానీ ఈ ఐదుగురు మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టుగా ఫోన్లలోనే మునిగారు. ఇది చూసిన చుట్టుపక్కల ప్రేక్షకులకు అనుమానం వచ్చింది. వాళ్లు వెంటనే స్టేడియం సిబ్బందికి సమాచారం అందించగా వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్వ్కాడ్ వారిని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా వారు ఇచ్చిన సమాచారం మేరకు సెంట్రల్ కోల్‌కతాలోని న్యూ మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు సంఖ్యలో మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ రూటర్ చార్జర్లు, డబ్బులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వీరి వెనుక పెద్ద హస్తం ఎవరిదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: ఊహించని ఓటమితో సహనం కోల్పోయిన గంభీర్! కేఎల్ రాహుల్‌ను పొట్టుపొట్టు తిట్టాడు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే రజత్ పాటిదార్ సూపర్ సెంచరీతో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది.
Well Deserved Victory ❤️💥 @RCBTweets
Onto The Next Challenge ⚡
Q2 – RR vs RCB , Ahemdabad ( 27 May )#RCBVSLSG #RCB #RajatPatidar pic.twitter.com/5vkeRuuweN
— Viratianz Universe (@Viratsathish_18) May 25, 2022
RrrrCcccBbbbb 💯🎊🎉♥️
RCB not only a Franchise it’s our Emotion ….♥️ #RCBVSLSG #IPL2022 #RCBvLSG #RCB #royalchallengersbangalore #KGF #Eliminator #EeSalaCupNamde pic.twitter.com/fuZsHK6uMw— Thirumal Varre (@thirumalyadav2) May 25, 2022