ఐపీఎల్ 2022లో భాగంగా 30వ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మూడేసి విజయాలతో రాయల్స్ 5వ స్థానంలో, కేకేఆర్ 6వ స్థానంలో ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏ జట్టు ముందుకు వెళ్లనుందో తెలుసుకోవాలంటే.. వారి బలాబలాలు పరిశీలిద్దాం.
కోల్‌కోత్తా నైట్ రైడర్స్..ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో చాలా బలంగా ఉంది. ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లకు తోడు పేసర్ ఉమేష్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ప్యాట్ కమిన్స్ పరుగులు ఇస్తున్నా.. వికెట్లు తీసే సత్తా ఉంది. బ్యాటింగ్‌లో అజింక్యా రహానే స్థానంలో ఆరోన్ ఫించ్ వచ్చినా.. తొలి మ్యాచ్‌లో రాణించలేదు. వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా చివరి మ్యాచ్‌లో విఫలం అయ్యారు. నితీష్ రాణా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగానే ఉంది. ఈ టీమ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే ప్లేయర్ కూడా పెద్ద షాట్లు ఆడే వారు ఉన్నారు. ఆండ్రూ రస్సెల్ చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు రాబడతాడు.
రాజస్థాన్ రాయల్స్..ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతనికి తోడు దేవదత్త్ పడిక్కల్ కొన్ని మ్యాచ్‌ల నుంచి ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇద్దరు రాణిస్తే.. రాయల్స్ భారీ స్కోర్ చేయగలదు. వన్‌డౌన్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ రాణిస్తున్నా.. బట్లర్ ఇచ్చిన స్టార్ట్‌తో భారీ స్కోర్ మల్చలేకపోయాడు. మిడిల్డార్‌లో హెట్‌మేయిర్ ఉండడం ఆ జట్టుకు అదనపు బలం. ఇక బౌలింగ్‌లో రాజస్థాన్ పటిష్టంగా ఉంది. పేసర్లు ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ద్ కృష్ణ ఉండగా.. స్పిన్‌లో అశ్విన్, చాహల్ రూపంలో తిరుగులేని జోడి రాజస్థాన్ సొంతం. అలాగే బ్యాటింగ్‌లో అశ్విన్‌ను ముందు పంపపడం లాంటి ప్రయోగాలు చేయకపోవడం ఉత్తమం.
పిచ్..
ఈ మ్యాచ్ ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే టాస్ కూడా ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. కేకేఆర్ బ్యాటర్లు వాళ్ల స్థాయితగ్గ ప్రదర్శన కనబరిస్తే.. విజయం ఖాయం.
కోల్‌కతా నైట్ రైడర్స్.. శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి.
రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంసన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, హెట్‌మేయిర్, డస్సెన్, అశ్విన్, చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ
Nothing to see here, just two of 🇳🇿’s finest catching up 👌
📸: Getty | #TimSouthee #TrentBoult #KKRHaiTaiyaar #RRvKKR #IPL2022 pic.twitter.com/0fQcPt4Nw1
— KolkataKnightRiders (@KKRiders) April 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.