గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోయింది. ఇందుకు యాంకర్ వర్షిణి కారణం అంటున్నారు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్. ఎందుకో తెలియాలంటే..
మన దగ్గర క్రికెట్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో.. అభిమానులు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీవీ ముందు కూర్చుని మ్యాచ్ చూస్తోన్న సరే.. మనమే గ్రౌండ్‌లో ఉండి ఆడుతున్నట్లు ఫీల్ అవుతాం. టీవీ ముందు కూర్చోనే సలహాలు, సూచనలు ఇస్తాం. అంతలా మ్యాచ్‌లో లీనమవుతాం. ఆట మీద అభిమానమే కాదు.. అర్థం లేని కొన్ని సెంటిమెంట్లను కూడా అలానే ఫాలో అవుతాం. అనుకొని సంఘటన జరిగితే.. అందుకు ఆ సెంటిమెంటే కారణం అనుకుంటాం. వీటి వల్ల మంచి జరిగితే ఓకే.. చెడు జరిగిందో ఇక ఉంటుంది చూడు.. తాజాగా యాంకర్ వర్షిణిపై నెటిజనులు ఇలానే మండి పడుతున్నారు. ఇంకోసారి స్టేడియంలో కనిపిస్తే బాగోదు అని వార్నంగ్ ఇస్తున్నారు. అసలు నెటిజనులు వర్షిణిని ఎందుకు టార్గెట్ చేశారు అంటే..
ఇక ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ అంది కూడా హైదరాబాద్‌లో అంటే.. ఇక ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు స్టేడియం వెళ్లి మ్యాచ్ చూడాలని కోరుకుంటారు. ఇక గురువారం హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ జరింగింది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో యాంకర్ వర్షణి వల్లనే ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. పైగా ఆధారాలు కూడా చూపిస్తున్నారు.
వాళ్లు చెప్పిన దాని ప్రకారం.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఫస్ట్ టైమ్ ఏప్రిల్ 18న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ చూడటం కోసం వెళ్లింది వర్షిణి. ఆ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఎస్‌ఆర్‌హెచ్.. 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత వర్షిణి మళ్లీ ఏప్రిల్ 24న అదే స్టేడియంలో దర్శనమిచ్చింది. అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎస్‌ఆర్‌హెచ్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. మళ్లీ నిన్న కూడా ఎస్‌ఆర్‌హెచ్.. కేకేఆర్ చేతిలో ఓడిపోయింది.
వర్షిణి మ్యాచ్ చూడటం కోసం స్టేడియానికి వెళ్లిన ప్రతి సారి ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది నెటిజనులు.. వీటన్నింటిని బాగా పరిశీలించి.. వర్షిణి వల్లే ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోయింది అని తేల్చేశారు. నువ్వు స్టేడియానికి వచ్చిన ప్రతి సారి ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోయింది. ఇంకోసారి ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ సమయంలో స్టేడియంలో కనిపించావో.. బాగోదు.. ఇప్పటికి ఉన్న దరిద్రం చాలు తల్లి.. నువ్వు దాన్ని మరింత పెంచకు అంటూ ఓ రేంజ్‌లో వర్షిణిపై ఫైర్ అవుతున్నారు. పాపం వర్షిణి.. ఏదో మ్యాచ్ చూడటం కోసం వెళ్తే.. నెటిజనులు తనను ఇలా ఆడేసుకుంటున్నారు. మరి ఇంతకు ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి కారణం ఏంటి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.