ఐపీఎల్ లేటెస్ట్ సెన్సేషన్ రింకు సింగ్.. మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆటతో కాదు పేద పిల్లల కోసం ఓ పనిచేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ఇంతకీ ఏంటి విషయం?
‘గాయం విలువల తెలిసినవాడే సాయం చేస్తాడు’.. ఇది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని డైలాగ్ కావొచ్చు. కానీ ఇప్పుడదే రియాలిటీలో జరుగుతోంది. ఐపీఎల్ లో రీసెంట్ గా ఒకే ఓవర్ లో ఐదు సిక్సులు కొట్టి కోల్ కతాని గెలిపించి స్టార్ అయిపోయిన రింకు సింగ్.. పేద పిల్లల కోసం గొప్ప మనసు చాటుకుంటున్నాడు. తనకు వచ్చిన ఐపీఎల్ సంపాదనతో అద్భుతమైన పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియా అంతటా వినిపిస్తోంది. ప్రతి ఒక్కరూ రింకుని తెగ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
అసలు విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్ అలీగఢ్ కి చెందిన రింకు సింగ్ ది చాలా పేద కుటుంబం. తండ్రి, అన్నదమ్ములిద్దరూ గ్యాస్ సిలిండర్స్.. ఇంటింటికి సరఫరా చేస్తుంటారు. రోజు గడవడమే కష్టంగా ఉండే ఈ ఫ్యామిలీ నుంచి క్రికెటర్ గా రావడం అంటే కష్టమే. కానీ పట్టు వదలని రింకు.. చాలా కష్టపడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018 నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా మారిపోయాడు. ఇన్నేళ్ల నుంచి జట్టులో ఉన్నప్పటికీ పెద్దగా పేరు అయితే తెచ్చుకోలేకపోయాడు.
రీసెంట్ గా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్. గెలవాలంటే చివరి 5 బంతుల్లో 29 పరుగులు చేయాలి. అలాంటి టైంలో వరసగా 5 సిక్సులు కొట్టిన రింకు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. పేదరికం నుంచి వచ్చాడు కాబట్టి ఎన్ని కష్టాలుంటాయో తెలుసు. ఈ క్రమంలోనే క్రికెటర్ కావాలనుకుంటున్న పేద పిల్లల కోసం రూ.50 లక్షల ఖర్చుతో హాస్టల్ నిర్మిస్తున్నాడు. ఈ విషయాన్ని రింకు చిన్నప్పటి కోచ్ మసూద్ జాఫర్ చెప్పారు. మూడు నెలల క్రితం నిర్మాణం మొదలైందని, ఈ హాస్టల్ లో 14 రూమ్స్ ఉంటాయని, ఒక్కో దానిలో నలుగురు వరకు ట్రైనీలు ఉండొచ్చని ఆయన చెప్పారు.
‘దాదాపు 12 మంది వరకు ట్రైనీలు మా హాస్టల్ కు వస్తారు. ఇప్పుడు వాళ్లంతా ఎక్కువ రెంట్ కట్టి ఉంటున్నారు. ఇక్కడైతే మినిమం రెంట్ కే హాస్టల్ రూమ్ తోపాటు ఫుడ్ కూడా తినొచ్చు. జర్నీ కోసం టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హాస్టల్ కు సంబంధించిన 90 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే నెలలోపు రెడీ అవుతుంది. ఐపీఎల్ నుంచి తిరిగొచ్చాక రింకు హాస్టల్ ని ప్రారంభిస్తాడు. యంగ్ క్రికెటర్లకు ఇదెంతో ఉపయోగపడుతుంది’ అని రింకు కోచ్ జాఫర్ పేర్కొన్నారు. మరి రింకు చేస్తున్న మంచి పనిపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
Rinku Singh to inaugurate hostel for poverty-stricken cricketers in Aligarh, Uttar Pradesh next month ❤️#rinkusingh #KKR #IndianCricket #insidesports #crickettwitter pic.twitter.com/HScraXWHhv
— InsideSport (@InsideSportIND) April 17, 2023