ఐపీఎల్ లో ఈ రోజు కేకేఆర్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేకేఆర్ జట్టు కి ఒక శుభవార్త. విండీస్ పవర్ హిట్టర్ కేకేఆర్ జట్టులో చేరనున్నాడు.
ఐపీఎల్ 2023 లో కేకేఆర్ జట్టు ఆట తీరు ఏమంత ఆశించిన తీరులో లేదు. ఒక మ్యాచ్ గెలిస్తే ఆ తర్వాత రెండు మ్యాచులు ఓడిపోవడం అలవాటుగా మారిపోయింది. ఇప్పటివరకు 9 మ్యాచుల్లో కేవలం 3 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. ఇక కేవలం 5మ్యాచులే మిగిలిన ఉండడంతో ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో కేకేఆర్ జట్టుకి రానున్న మ్యాచులు అన్నీ డూ ఆర్ డై అనే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ రోజు ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేకేఆర్ జట్టు కి ఒక శుభవార్త. విండీస్ పవర్ హిట్టర్ జాన్సన్ చార్లెస్ కేకేఆర్ జట్టులో చేరనున్నాడు.
ఐపీఎల్ 2023 లో ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ సారి తక్కువగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. రస్సెల్, మేయర్స్, పూరన్, మినహా పెద్దగా చెప్పుదగ్గ ప్లేయర్లు ఎవరూ లేరు. అయితే ఐపీఎల్ లో విండీస్ ప్లేయర్లకు చాలా అద్భుతమైన రికార్డ్ ఉంది. ఐపీఎల్ అంటే వీరికి పూనకం వచ్చినట్లుగా ఆడేస్తారు. అయితే ఇప్పుడు విండీస్ వీరుడు చార్లెస్ కూడా తన పవర్ హిట్టింగ్ ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తొలిసారి కేకేఆర్ జట్టుతో కలిసి ఆడబోతున్నాడు. బంగ్లాదేశ్ వికెట్ కీపర్, ఓపెనర్ లిట్టన్ దాస్ కి రీ ప్లేస్ గా కేకేఆర్ యాజమాన్యం చార్లెస్ ని జట్టులోకి తీసుకొచ్చింది.
చార్లెస్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్ లో భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అంతే కాదు ఏ సిరీస్ లో చార్లెస్ 200 పైగా స్ట్రైక్ రేట్ నమోదు చేయడం విశేషం. పట్టిష్టమైన దక్షిణాఫ్రికా బౌలింగ్ ని ఎదుర్కొంటూ అవలీలగా సిక్సులు కొట్టేసాడు. ఇదే ఫామ్ ఐపీఎల్ లో కూడా చూపిస్తే కేకేఆర్ జట్టు మరింత మెరుగైన ప్రదర్శన చేసే అవకాశముంటుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ ప్లేయర్ జాసన్ రాయ్ గాయపడడంతో తుది జట్టులో చార్లెస్ కి అవకాశం దక్కేలా కనబడుతుంది. మరి చార్లెస్ కేకేఆర్ జట్టులో చేరడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.