ఐపీఎల్ 2022లో భాగంగా 23వ మ్యాచ్‌లో ఐపీఎల్ అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో ముంబై ఆడిన నాలుగు మ్యాచ్‌లను ఓడింది. పంజాబ్ నాలుగులో రెండు విజయాలు, రెండు ఓటములతో ఉంది. మరి ముంబై తొలి గెలుపు నమోదు చేస్తుందా? లేక పంజాబ్ మూడో విజయాన్ని సొంతం చేసుకుంటుందా? తెలుసుకోవాలంటే ఒక సారి వారి బలాబలాలు పరిశీలిద్దాం..
ముంబై ఇండియన్స్..
ఈ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మాత్రమే రాణిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, పొలార్డ్ ఫామ్‌లోకి రావాల్సి ఉంది. ఇక బౌలింగ్ విభాగం చాలా వీక్‌గా ఉంది. బుమ్రా మినహా మిగతా వారందరూ ధారళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఒక నిఖార్సయిన స్పిన్నర్ లేకపోవడం ముంబైలో ప్రధాన లోపం.
పంజాబ్ కింగ్స్..
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమతూకంగా ఉంది. జానీ బెయిర్‌స్టో చేరికతో ఆ జట్టు మరింత బలపడింది. కానీ.. తొలి మ్యాచ్‌లో బెయిర్‌స్టో నిరాశ పరిచాడు. అయినా అతన్ని తక్కువ అంచనా వేయలేం. అలాగే లివింగ్‌స్టోన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఫామ్‌లోకి రావాల్సి ఉంది. ఆ జట్టుకు ఇంతవరకు మంచి ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ లభించలేదు. శిఖర్ ధావన్ రాణిస్తున్నా.. మయాంక్ నిరాశపరుస్తున్నాడు. రబడా, ఆరోరా, అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్, ఒడియన్‌స్మిత్‌తో బౌలింగ్ అటాక్ ముంబై కంటే మెరుగ్గా ఉంది.
పిచ్..
ఈ మ్యాచ్ పుణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటూనే.. స్పిన్నర్లకు కూడా సహకారం లభిస్తుంది. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 170 పరుగుల చేసే అవకాశం ఉంది.
హెడ్ టూ హెడ్..
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు జరగ్గా.. 14 మ్యాచ్‌లలో ముంబై, 13 మ్యాచ్‌లలో పంజాబ్ విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌తో పంజాబ్ లెక్క సరి చేస్తుందో.. లేక ముంబై పైచేయి సాధిస్తుందో చూడాలి.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ విజయం సాధించే అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్లకు సహకరిస్తుండడంతో.. పంజాబ్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ రాణిస్తే.. పంజాబ్‌కు మూడో విజయం ఖాయం.
తుది జట్ల అంచనా..
ముంబై.. రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, పొలార్డ్, రమన్‌దీప్ సింగ్, మురగన్ అశ్విన్, జైదేవ్ ఉనద్కట్, బుమ్రా, థంపి.
పంజాబ్.. మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, లిమ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, రబడా, రాహుల్ చాహర్, ఆరోరా, అర్షదీప్ సింగ్.
Jann 𝐡𝐢𝐭 mein jaari ⚠️#SaddaPunjab #IPL2022 #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ #MIvPBKS @sandeep25a pic.twitter.com/jDOb0tz22h
— Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.