ఐపీఎల్ లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 2 లో తలబడబోతున్నాయి. ఇదిలా ఉండగా నేడు జరగబోయే మ్యాచులో ఒక రకంగా ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరేట్ గా దిగబోతుందని చెప్పుకోవచ్చు.
ఐపీఎల్ లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 2 లో తలబడబోతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మరి కొద్దిసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఒకరకంగా సెమి ఫైనల్ లాంటిది కావడంతో ఇరు జట్లు తమ శక్తికి మించి ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. లక్నో సూపర్ జయింట్స్ మీద భారీ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఆత్మ విశ్వాసంతో కనబడుతుంది. ఇక మరోవైపు గుజరాత్ టైటాన్స్ చెన్నై చేతిలో ఓడిపోయినా.. సొంత గడ్డమీద ఆడనుండడం వారికి కలిసి రానుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు ఫేవరేట్ అనే విషయం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఒక విషయంలో మాత్రం గుజరాత్ ని ఆందోళనకి గురి చేస్తుంది.
దాదాపు రెండు నెలలుగా జరుగుతూ వస్తున్న ఐపీఎల్ 70 మ్యాచులతో లీగ్ దశను పూర్తి చేసుకుంది. ఇక ప్లే ఆఫ్ లో స్టార్ట్ అయ్యి క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచులు కూడా ముగిసాయి. ఇక మిగిలింది కేవలం రెండే మ్యాచులు గావడం గమనార్హం. అందులో ఒకటి నేడు జరగబోయే క్వాలిఫయర్ 2 అయితే.. ఆదివారం గ్రాండ్ ఫైనల్ జరగబోతుంది. ఇదిలా ఉండగా నేడు జరగబోయే మ్యాచులో ఒక రకంగా ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరేట్ గా దిగబోతుందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం వారి గత రికార్డ్ కావడం విశేషం.
ఐపీఎల్ అత్యున్నతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటివరకు 5 టైటిల్స్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రికార్డ్ చూస్తే షాకవ్వాల్సిందే. ఈ జట్టు తమ చివరి 7 ప్లే మ్యాచులని ఒకసారి పరిశీలిస్తే..ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్కసారి ప్లే ఆఫ్ కి వస్తే ముంబై గర్జన ఎంత భయంకరంగా ఉంటుందో ఈ రికార్డ్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రికార్డ్ గుజరాత్ కి చేపటాలు పట్టిస్తుంది. ఇప్పటికే లక్నో మీద గెలిచి బోలెడంత విశ్వాసంతో కనిపిస్తున్న రోహిత్ సేన.. తమ స్థాయికి తగ్గట్టుగా ఆడితే విజయం సాధించడం గ్యారంటీ. అయితే ఈ సీజన్ లో అద్భుతంగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ ముంబై జోరుకి బ్రేక్ వేస్తుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.