ముంబయి ఓడిపోవడానికి గిల్ సెంచరీనో, గుజరాత్ టీమ్ సూపర్ బౌలింగో కారణం కాదు. జస్ట్ ఒకే ఒక్క క్యాచ్.. రోహిత్ సేన కొంప ముంచింది. ఫైనల్ చేరకుండా అడ్డుకుంది. ఇంతకీ ఏం జరిగింది?
ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ లో ఓడిపోయింది. ఆరోసారి కప్ కొట్టాలనే కల, కలగానే మిగిలిపోయింది. ఎందుకంటే క్వాలిఫయర్-2లో గుజరాత్ జట్టు.. రోహిత్ సేనపై 62 పరుగుల తేడాతో గెలిచేసింది. ప్లే ఆఫ్స్ వరకు ముంబయి బౌలింగ్ సరిగా లేకపోయినప్పటికీ వచ్చేసింది. కానీ ఈ మ్యాచ్ లో డొల్లతనం బయటపడింది. బ్యాటింగ్ లో సూర్య, తిలక్ వర్మ ఆకట్టుకున్నప్పటికీ బౌలర్లు అప్పటికే నష్టం చేసేశారు. ఇది కాదన్నట్లు ముంబయి వదిలిన ఓ క్యాచ్ మొత్తం మ్యాచ్ నే మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ ఆ క్యాచ్ సంగతేంటి?
అసలు విషయానికొచ్చేస్తే.. సొంతగడ్డపై క్వాలిఫయర్-2 మ్యాచ్. గుజరాత్ రెట్టించిన ఉత్సాహంతో ఆడింది. మరీ ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ గిల్ రెచ్చిపోయాడు. కొట్టడమే పనిగా పెట్టుకుని మరీ బ్యాటింగ్ చేశాడు. 60 బంతుల్లో 129 పరుగులు చేసి శెభాష్ అనిపించాడు. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. గిల్ బీభత్సం వల్ల నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 233/3 స్కోరు చేసింది. ఛేదనలో ముంబయి తడబడింది. సూర్య కుమార్ 61, తిలక్ వర్మ 43 మాత్రం చెప్పుకోదగ్గ రన్స్ కొట్టారు. దీంతో 171 పరుగులకు ఆలౌటైపోయిందీ జట్టు. గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టేసింది.
ఈ మ్యాచ్ లో ఏకంగా సెంచరీతో రెచ్చిపోయిన గిల్.. ముంబయికి మంచి ఛాన్స్ ఇచ్చాడు. కానీ వీళ్లు సరిగా ఉపయోగించుకోలేకపోయారు. 30 పరుగుల దగ్గర గిల్ క్యాచ్ ఇచ్చాడు కానీ ముంబయి ఫీల్డర్ టిమ్ డేవిడ్ దాన్ని నేలపాలు చేశాడు. అదే గిల్ 129 పరుగులు చేసి మళ్లీ క్యాచ్ ఇచ్చాడు. ఈసారి టిమ్ డేవిడ్ పట్టేశాడు. అదేదో ముందే పట్టేసి ఉంటే.. గిల్ ని ఆపి ఉండేవారు. దీంతో గుజరాత్ స్కోరు తక్కువ ఉండేది. ముంబయిపై ఒత్తిడి తగ్గుండేది. కనీసం మ్యాచ్ గెలిచే ఛాన్సు ఉండేది. సో అదనమాట విషయం. ఇదొక్కటే కాదు ముంబయి ఈ మ్యాచ్ లో చాలా తప్పులే చేసింది. కానీ వాటిలో గిల్ క్యాచ్ మిస్ చేయడం మాత్రం ఘోరమైన తప్పిదమని చెప్పొచ్చు. మరి దీనిపై మీరేం అంటారు? కింద కామెంట్ చేయండి.
#Gill 👌 pic.twitter.com/ayI6uylnSS
— தனி ஒருவன் (@thanioruvan____) May 26, 2023