ఐపీఎల్ 2022లో లక్నో సూపర్‌జెయింట్స్ ఐదో విజయం సాధించింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో గెలిచింది. కాగా ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో కృనాల్ పాండ్యా.. ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌తో వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా పొలార్డ్ కృనాల్ పాండ్యాను అవుట్ చేశాడు. ఇక ముంబై లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ వికెట్‌ను కృనాల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్ వీపు పైకి దుమికి కృనాల్ అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. అయితే, పొలార్డ్ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో పొలార్డ్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా కృనాల్ అతి చేశాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. పొలార్డ్ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటపుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి.
అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్‌రూంలో ‘స్నేహితుల’తో ఏడాదంతా ఎంత సరదాగా ఉన్నా పర్లేదు కానీ.. మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్ మరీ ఓవర్‌గా అనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 115 పరుగులు(అత్యధిక స్కోరు: 25) చేసిన ఈ వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్.. 3 వికెట్లు తీశాడు. ఇక లక్నోతో మ్యాచ్‌లో పొలార్డ్ చేసిన స్కోరు: 20 బంతుల్లో 19 పరుగులు. మరి రన్స్ చేయడం లేదు, జట్టు మ్యాచ్ గెలవడం లేదనే ప్రస్టేషన్‌లో ఉన్న పొలార్డ్‌తో కృనాల్ వ్యవరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ముంబైపై మూడో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా
Rare picture of krunal pandya doing totaka to pollard#MIvLSG pic.twitter.com/T4lywiuJKv
— जौली B.Sc (@jocular676) April 24, 2022
#Krunalpandya loving the out of #Pollard
You would love 💕 it 😉😉#MIvsLSG #LSGvMI #IPL2022 #RohitSharma𓃵 #Mumbaiindians pic.twitter.com/sY2SCsEnMy
— DaebakAnkita💃 (@DaebakankitaF) April 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.