ఐపీఎల్ 2022 లో భాగంగా శనివారం(ఏప్రిల్ 30) డబుల్ ధమాకా ఉండనుంది. మొదటి మ్యాచ్ గుజరాత్, బెంగళూరు మధ్య జట్ల జరుగుతుండగా, రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తపడనున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ ఓవైపు, వరుసగా రెండు పరాజయాలతో ఢీలా పడ్డ బెంగళూరు మరోవైపు.. ఇలా రెండు జట్ల మధ్య ఆసక్తి పోరు జరుగుతోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (0)ను సంగ్వాన్ డకౌట్ చేశాడు. దీంతో మరోసారి బెంగళూరు బ్యాటింగ్ కుప్పకూలుతుందని అంతా భావించారు. అయితే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (53 నాటౌట్), రజత్ పటీదార్ (47 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. గడిచి రెండు మ్యాచ్లో డకౌట్ వెనుదిరిగిన విరాట్ కోహ్లి ఈ మ్యాచులో తన జోరును కొనసాగిస్తున్నాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో 45 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దీంతో ఆర్సీబీ 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. ఫామ్ లేక సతమతమవుతున్న విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
50 🥺🥺♥️♥️
All because of lady luck😌😌@RCBTweets @imVkohli #ViratKohli #ViratKohli𓃵 #AnushkaSharma #RCBvsGT #RCB #GTvRCB pic.twitter.com/mfofKH7TaP— ♡ਸ਼ਹਨਾਜ਼ ਸਿਧਾਰਥ ਸ਼ੁਕਲਾ♡ (@Sidnaaz__12) April 30, 2022