ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు కన్నులపండగ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా కేఎల్ రాహుల్- డీకాక్ ల బ్యాటింగ్.. ఈ సీజన్ కే హైలెట్. 20 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. 210 పరుగులు చేశారు. డికాక్.. 70 బంతుల్లో 140 నాటౌట్! 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో.. ఆకాశమే హద్దుగా చెలరేగి అసలైన ఐపీఎల్ మజాను ప్రేక్షకులకు అందించాడు. ఈ క్రమంలో డికాక్ బ్యాటింగ్ చూసి.. ముంబై ఇండియన్స్ కుళ్లికుళ్లి ఏడ్చింటదని కామెంట్స్ వస్తున్నాయి. ఇషాన్ కిషన్ ను నమ్ముకునే బదులు.. డికాక్ ను నమ్ముకొని ఉంటే.. కనీసం ప్లే ఆఫ్స్ కు అయినా వచ్చేవాళ్ళుగా అంటూ నెటిజన్స్ సానుభూతి చూపిస్తున్నారు.
గత సీజన్ వరకు ముంబై స్క్వాడ్‌లో ఓపెనర్‌గా, కీపర్‌గా రాణించిన క్వింటన్ డికాక్‌ను వదులుకొని ముంబై పెద్ద తప్పే చేసింది. మెగావేలంలో.. ఇషాన్ కిషన్ పై అతి నమ్మకాన్ని పెంచుకున్న ముంబై.. రూ.15.25 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది. ఈ ధరతో ఇషన్.. ఐపీఎల్ 2022 సీజన్ లో అత్యంత ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించగలిగాడే తప్ప.. ఆ ధరకు న్యాయం చెయ్యలేకపోయాడు. ఇప్పటివరకు 13 మ్యాచులాడిన ఇషన్ కిషన్.. 370 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంటే.. ఒక్కో పరుగుకు 4 లక్షల 12 వేలు అన్నమాట. ఆహా ఎంత విలువైనో పరుగులో..కదా! ఇషాన్ కిషన్ ను దక్కించుకున్న ముంబై ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. డికాక్ ను దక్కించుకున్న లక్నో.. పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో ఉంది. ఇక.. డికాక్‌ను మెగావేలంలో 6.75 కోట్లకు లక్నో దక్కించుకుంది. పెట్టిన పైసలకు తగ్గట్లు డికాక్ ఈ సీజన్ లో 14 మ్యాచుల్లో 502 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.
Quinton de Kock has just blasted the third-highest individual score in Indian Premier League history 🙌
Incredible hitting 💥#IPL2022 pic.twitter.com/84lQ3F029Q
— Wisden (@WisdenCricket) May 18, 2022
When you realize your son spent 15 CR on the lookalike of Quinton De Kock#LSGvsKKR #IPL2022 #LSG pic.twitter.com/HalWMbAa2u
— Rajabets India🇮🇳👑 (@smileandraja) May 18, 2022
ఇది కూడా చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ గెలవాలని RCB ఫ్యాన్స్ ప్రార్థనలు
2016 సీజన్ లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్ లో తన తొలి సెంచరీ(108పరుగుల) నమోదుచేసిన డికాక్.. తాజాగా ఈ సీజన్ లో కోల్‌కతాపై రెండో సెంచరీ చేశాడు. అలాగే ఐపీఎల్ లో డికాక్‌కు ఈ సెంచరీ (140పరుగులు) అత్యధిక స్కోరు. ఈ క్రమంలో కేకేఆర్ జట్టుపై ఏ వికెట్‌కు అయిన అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా కేఎల్ రాహుల్, డికాక్ జోడీ నిలిచింది. అంతకుముందు 2012లో గిబ్స్, రోహిత్ కలిసి కేకేఆర్ మీద 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయగా.. ఆ రికార్డును బద్దలు కొట్టిన రాహుల్, క్వింటన్ డికాక్ జోడీ 210 పరుగుల అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా నిలిచింది. ఇక.. ఏ వికెట్‌కు అయిన అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన రికార్డులోనూ ఈ జోడీ మరో రికార్డును నమోదు చేసింది. 2016లో కోహ్లీ, డివిలియర్స్ జోడీ 229 పరుగుల భాగస్వామ్యాన్ని గుజరాత్ లయన్స్ పై నమోదుచేయడం అత్యధికం కాగా తర్వాత అదే జోడీ 2015లో ముంబైపై 215పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసింది. ఇక మూడో స్థానంలో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ జోడీ (210) ఉంది.
Quinton de Kock’s 140* was the third-highest individual score in IPL history 😲#IPL2022 pic.twitter.com/nYQp2JmYiY
— ESPNcricinfo (@ESPNcricinfo) May 18, 2022