శుక్రవారం(ఏప్రిల్ 22) రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ‘నోబాల్ వివాదం‘ రచ్చ అంతా ఇంతా కాదు. చివరి ఓవర్ లో వేసిన మూడో బంతి నో బాల్ అంటూ పెద్ద రచ్చే జరిగింది. ఈ బాల్ విషయంలో విమర్శలు, ప్రతి విమర్శలు.. ఇలా ఎవరికీ తోచింది వారు తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కొంతమంది మాత్రం ‘అది క్లియర్ నోబాల్’ అని అంటుండగా.. మరికొందరు మాత్రం అంపైర్ హడావుడిలో తీసుకున్న నిర్ణయమని.. దాన్ని మనం గౌరవించాలంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతన్నా ఆన్-ఫీల్డ్ అంపైర్, ఈ విషయాన్నీ థర్డ్ అంపైర్ కు ఎందుకు రిఫర్ చేయలేదు అనే మాట కూడా వినిపిస్తోంది. అవును కదా?. మరి అందుకు రిఫర్ చేయలేదో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
జెంటిల్‌మెన్ గేమ్ గా పిలవబడే క్రికెట్ లో లెక్కలేనన్ని రూల్స్. అవుట్, నాట్ అవుట్, క్యాచ్ అవుట్, రనౌట్, వైడ్, నో బాల్, బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ.. ఇల్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రూల్స్. రెండు జట్ల మధ్య జరిగే పోరులో ‘ఈ రూల్స్’ విషయంలో తుది నిర్ణయం మాత్రం అంపైర్లదే. అది అవుట్ అయినా, నాట్ అవుట్ అయినా.. ఏ డెసిజన్ అయినా అంపైర్లే తీసుకుంటారు. అయితే.. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అప్పుడప్పుడు ఆన్-ఫీల్డ్ అంపైర్లు, తమకు సందేహంగా ఉన్న విషయంపై(క్యాచ్ అవుట్, రనౌట్ అయిన సందర్భాల్లో) థర్డ్ అంపైర్ నిర్ణయం అడగడం మనం చూశాం. మరి శుక్రవారం జరిగిన మ్యాచులో థర్డ్ అంపైర్ ఏమయ్యాడంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ విషయంలో థర్డ్ అంపైర్ అందుకు జోక్యం చేసుకోలేదంటే.. ‘బ్యాటర్‌ను అవుట్ కానప్పుడు ఆన్-ఫీల్డ్ అంపైర్ నడుము ఎత్తులో ఉన్న నో-బాల్‌ను థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయలేరు’ అన్న నిబంధన ప్రస్తుతమున్న క్రికెట్ రూల్సులో ఒకటి. అందువల్లనే థర్డ్ అంపైర్ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు.
#RishabhPant 😯🤯🔥
Whole incident on umpiring…..#DCvsRR #DCvRR #RRvsDC #RRvDC #IPL2022 #IPL #umpire #noball #Shardulthakur #SanjuSamson #umpiring #Cheater @RishabhPant17 @IamSanjuSamson #DelhiCapitals #shanewatson #rovmanpowell @tanay_chawda1 @Cricketracker #JosButler pic.twitter.com/NRYdlMxrZk
— Anmol Narang (@Anmol_Narang_) April 22, 2022
Meanwhile Chahal & Kuldeep 😂#RRvsDC #noball #RishabhPant pic.twitter.com/8cJmAl1nmz
— Cric kid (@ritvik5_) April 22, 2022
ఇది కూడా చదవండి: నో బాల్ ఘటనపై సీరియస్ అయిన ఐపీఎల్ కమిటీ! పాపం.. పంత్ బలి