ఐపీఎల్ 2022లో బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు దుమ్మురేపారు. 116 పరుగుల స్వల్ప లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగి.. రన్‌రేట్ పెంచుకునేందుకు ధాటిగా ఆడారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ పృథ్వీషా కూడా 20 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 41 పరుగులు చేసి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఎల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కాగా ఈ మ్యాచ్‌తో డేవిడ్ వార్నర్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ఒకే జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. పంజాబ్‌పై వార్నర్ 1005 పరుగులు చేశాడు. వార్నర్ కంటే ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్‌కత్తా నైట్ రైడర్స్‌పై 1018 పరుగులు చేసి ముందు వరుసలో ఉన్నాడు. మరి వార్నర్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఆడేవాడు. గతేడాది వార్నర్‌ను కెప్టెన్‌గా తొలగించిన SRH ఆ తర్వాత తుది జట్టులోంచి కూడా తొలగించింది. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు రిటేన్ కూడా చేసుకోలేదు. దీంతో ఐపీఎల్ వేలంలో వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రారంభలో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన వార్నర్ ఆ తర్వాత జట్టులో చేరాడు. తొలి మ్యాచ్‌లో విఫలం అయినా.. తర్వాత అద్భుతంగా రాణిస్తున్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. జితేష్ శర్మ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలీత్ యాదవ్, కుల్దీప్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ముస్తఫీజుర్ ఒక వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ చాలా వేగంగా పూర్తి చేసింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలోనే 119 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఆ ఒక్క వికెట్‌ను రాహుల్ చాహర్ తీశాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా కుల్దీప్ యాదవ్ నిలిచాడు. మరి వార్నర్ సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ బ్రెయిన్ ‘ఫ్రై’ అయిపొయింది: రవిశాస్త్రి
Yeh Warner hain, jhukega nahi 🔥@davidwarner31 and @RishabhPant17‘s #Pushpa pose was just the perfect way to celebrate the win 😎#YehHaiNayiDilli | #IPL2022 | #DCvPBKS#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/Wl1BoeTAKD
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.