ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అభిమానులకి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటిచేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లోలేకపోవడమే వార్నర్ రిటైర్మెంట్ కి కారణమని తెలుస్తుంది.
ఆస్ట్రేలియా క్రికెట్ లో ఎంతమంది స్టార్లు ఉన్నా డేవిడ్ వార్నర్ స్థానం ప్రత్యేకం. ఈ విధ్వంసకర ఓపెనర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడకుండానే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి ఆశ్చర్యానికి గురి చేసిన వార్నర్.. అతి తక్కువకాలంలోనే టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. కేవలం వైట్ బాల్ క్రికెట్ కే పనికొస్తాడనుకున్నా వార్నర్.. టెస్టు క్రికెట్ లో కూడా దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తూ తనదైన ముద్ర వేసాడు. వేగంగా ఆడుతూనే నిలకడ చూపించే అతి కొద్ది మంది బ్యాటర్లలో వార్నర్ ఒకడు. ఈ క్రమంలో ఈ డాషింగ్ ఓపెనర్ ఆసీస్ జట్టులో కీలకంగా మారాడు. అయితే గత కొంతకాలంగా వార్నర్ టెస్టుల్లో ఘోరంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. దీంతో ఇక ఈ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంటే తెలియని వారుండరు. ఐపీఎల్ ఆడి ఇక్కడ ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యాడు ఈ డాషింగ్ బ్యాటర్. ఇదిలా ఉండగా .. వార్నర్ ఇటీవల కాలంలో టెస్టుల్లో పదే పదే విఫలమవుతున్నాడు. గత రెండేళ్లలో 17 టెస్టులు ఆడిన అతను ఒకే ఒక సెంచరీ మాత్రమే ఉంది. దీంతో జట్టుకి భారంగా మారిన వార్నర్ మీద చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు కెప్టెన్సీ విషయమై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో వార్నర్‌కు విభేదాలు కూడా ఉన్నాయి. ఈ కారణాల వలన ఇక త్వరలో టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడు. వచ్చే ఏడాది సొంత గడ్డపైనే టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలగాలని వార్నర్ భావిస్తున్నాడు. తనకెంతో ఇష్టమైన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో పాకిస్థాన్‌తో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆఖరి టెస్ట్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని శనివారం వార్నరే స్వయంగా వెల్లడించాడు.
ఇక వార్నర్ టెస్టు క్రికెట్ ని పరిశీలిస్తే.. ఇప్పటివరకు 103 టెస్టు మ్యాచులు ఆడాడు. 188 ఇన్నింగ్స్ లు ఆడి 8158 పరుగులు చేసాడు. వీటిలో 25 సెంచరీలతో పాటు 34 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక వార్నర్ అత్యధిక స్కోర్ 335 కావడం గమనార్హం. ప్రస్తుతం 36 ఏళ్ళ వార్నర్ అన్ని ఫార్మాట్లకి కూడా త్వరలో తన నిర్ణయాన్ని తెలియజేయనున్నాడు. తన టెస్టు రిటైర్మెంట్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిన వార్నర్.. ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో 2024 టీ 20 ప్రపంచకప్ తన కెరీర్ లో చివరిదని వెల్లడించే అవకాశముందని చెప్పేసాడు. కానీ వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. మొత్తానికి టెస్టు మరి కొన్నినెలల్లో టెస్టుల్లో వీడ్కోలు పలకనున్న వార్నర్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.