క్రికెట్ లో స్టన్నింగ్ డెలివరీస్ చూస్తూనే ఉంటాము. టెస్టు క్రికెట్ లో నైతే ఇలాంటి బాల్స్ ఎక్కువగా కనబడతాయి. పిచ్ బౌలింగ్ కి అనుకూలించినప్పుడు కొన్ని షాకింగ్ డెలివరీస్ కూడా చూస్తూ ఉంటాము. అలాంటి ఒక బంతిని ఇంగ్లాండ్ పేసర్ జోష్ టంగ్ వేసాడు.
యాషెస్ లో భాగంగా లార్డ్స్ లో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. నిన్నమొదలైన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లను 339 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ ఖవాజా త్వరగానే ఔటైనా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక వార్నర్ ఔటైన తర్వాత లబు షేన్(47), స్మిత్ సెంచరీ భాగస్వామ్యంతో ఆసీస్ ని ఆదుకున్నారు. ఇక ఆట కాసేపట్లో ముగుస్తుంది అనుకున్న సమయంలో ఇంగ్లాండ్ పార్ట్ బౌలర్ ఒకే ఓవర్లో హెడ్, గ్రీన్ వికెట్లు తీసి పెద్ద షాక్ ఇచ్చాడు . ప్రస్తుతం క్యారీ, స్మిత్ క్రీజ్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో ఒక స్టన్నింగ్ డెలివరీ ఇప్పుడు వైరల్ గా మారింది.
క్రికెట్ లో స్టన్నింగ్ డెలివరీస్ చూస్తూనే ఉంటాము. టెస్టు క్రికెట్ లో నైతే ఇలాంటి బాల్స్ ఎక్కువగా కనబడతాయి. పిచ్ బౌలింగ్ కి అనుకూలించినప్పుడు కొన్ని షాకింగ్ డెలివరీస్ కూడా చూస్తూ ఉంటాము. అలాంటి ఒక బంతిని ఇంగ్లాండ్ పేసర్ జోష్ టంగ్ వేసాడు. వార్నర్ కి వేసిన ఈ బంతి డేవిడ్ వార్నర్‌కు వేసిన ఈ బంతి అయితే అతని బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి దూసుకెళ్లి మిడిల్ స్టంప్‌ను లేపేసింది. ఈ బంతి ఇంత భారీగా ఇన్ స్వింగ్ అవడంతో స్టేడియంలో అభిమానులు షాక్ అవ్వగా.. వార్నర్ అయితే ఈ స్టన్నింగ్ డెలివరీకి నోరెళ్ల బెట్టాడు. అంతకు ముందు ఖవాజా కూడా టంగ్ బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డయ్యాడు.
ఇటీవలే క్రికెట్ లో డెబ్యూ చేసిన ఈ బౌలర్ పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ బంతిని చూసిన ఆడియన్స్ అయితే ఫిదా అయిపోయి టంగ్ వేసే ఇన్‌స్వింగర్స్ నాగినీ తో పోల్చి చూసారు. అదొక స్నేక్ బాల్ అని ఈ యువ పేసర్ ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం టంగ్ వేసే ఇన్‌స్వింగర్స్ సోచిలో మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక మొత్తం 18 ఓవర్లు వేసిన ఈ యువ పేసర్ ఓపెనర్ల వికెట్లు తీసి ఇంగ్లాండ్ కి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మరి వార్నర్ ని అవుట్ చేసిన ఈ డెలివరీ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Warner GONE! 🤩
S̶t̶u̶a̶r̶t̶ ̶B̶r̶o̶a̶d̶ Josh Tongue gets his man! #EnglandCricket | #Ashes pic.twitter.com/3sw6FSU2To
— England Cricket (@englandcricket) June 28, 2023