ఓపెనర్ గా వచ్చి నిలకడగా, పరుగులు చేయడం వార్నర్ కే చెల్లింది. ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే అంతర్జాతీయ క్రికెట్ లో డెబ్యూ చేసి తన బ్యాట్ తోనే విమర్శలకు సమాధానం చెప్పాడు. అయితే వార్నర్ టెస్టు క్రికెట్ కి త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సమాచారం.
ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ దగ్గర పడినట్లుగానే కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వార్నర్.. యాషెస్ తర్వాత టెస్టు క్రికెట్ కి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ వార్నర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఒక్క అర్ధ సెంచరీ మినహా మిగిలిన అన్ని ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. దీంతో సిరీస్ లో కీలకమైన నాలుగో టెస్టులో వార్నర్ కి ఉద్వాసన పలకనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఆల్ రౌండర్ గ్రీన్ తిరిగి జట్టులో చేరడంతో మార్ష్ ని తప్పించే సాహసం ఆస్ట్రేలియా చేయాలనుకోవడం లేదు. ఇదే జరిగితే వార్నర్ బెంచ్ మీద కూర్చోవడం ఖాయం. తాజాగా వార్నర్ భార్య క్యాండీ వార్నర్..ఇంస్టాగ్రాం లో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది.
ఓపెనర్ గా వచ్చి నిలకడగా, పరుగులు చేయడం వార్నర్ కే చెల్లింది. ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే అంతర్జాతీయ క్రికెట్ లో డెబ్యూ చేసి తన బ్యాట్ తోనే విమర్శలకు సమాధానం చెప్పాడు. ఫార్మాట్ ఏదైనా దూకుడే మంత్రంగా అనేక ప్రపంచ రికార్డులని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్ లో వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ లో దాదాపు సగం రికార్డులు ఈ డాషింగ్ బ్యాటర్ పేరు మీదనే ఉన్నాయంటే వార్నర్ విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఒకప్పుడు ప్రస్తుతం వార్నర్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ లు కరువవుతున్నాయి. అడపాదడపా ఇన్నింగ్స్ లు ఆడుతున్నా వార్నర్ స్థాయి ఇన్నింగ్స్ ఒక్కటి కూడా చూడలేకపోతున్నారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్ టెస్టు క్రికెట్ నుండి వైదొలిగే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు.
“టెస్టు క్రికెట్ లో వార్నర్ ఎరా ముగిసింది. కెరీర్ అంతా చాలా సరదాగా గడిచింది. మద్దతుగా నిలిచిన వారికి న కృతజ్ఞతలు”. అని వార్నర్ భార్య ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. దీన్ని బట్టి వార్నర్ టెస్టు రిటయిర్మెంట్ చాలా దగ్గరలో ఉందని తెలుస్తుంది. అదే జరిగితే యాషెస్ తర్వాత వార్నర్ టెస్టు క్రికెట్ కి వీడ్కోలు పలికే అవకాశముంది. ఇప్పటివరకు కెరీర్ లో ఇప్పటివరకు 107 టెస్టుల్లో 8343 పరుగులు 142 వన్డేల్లో 6030 పరుగులు, 99 టీ 20 మ్యాచుల్లో 2894 పరుగులు చేసాడు. మూడు ఫార్మాట్ లో కలిపి వార్నర్ 45 సెంచరీలు బాదేశాడు. మొత్తానికి వార్నర్ భార్య ఇలా రిటైర్మెంట్ గురించి హింట్ ఇవ్వడం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.