ఐపీఎల్ 2022లో ఎస్‌ఆర్‌హెచ్ యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. కళ్లు చెదిరే వేగంతో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్న ఉమ్రాన్.. అదే స్పీడ్‌తో యార్కర్లు కూడా సంధిస్తున్నాడు.. సీజన్ ఆరంభం నుంచి అత్యంత వేగవంతమైన బంతులు వేయడంతో పాటు కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్ ధారాళంగా పరుగులిస్తుండడం కొంతవరకు నిరుత్సహ పరుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఎస్‌ఆర్‌హెచ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు తనదైన శైలిలో హెచ్చరికలు పంపాడు.
”ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ బాగుంది. ప్రతి మ్యాచులో గంటకు 156, 157 కిమీవేగంతో బంతులు విసరడమనేది మాములు విషయం కాదు. సీజన్ ఆరంభం నుంచి అత్యంత వేగవంతమైన బంతులు సంధించడంతో పాటు కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టుకు విజయాలు అందించాడు. కానీ అదే ఉమ్రాన్ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో పూర్తిగా విఫలమయ్యాడు. మూడు మ్యాచులకు కలిపి 125 పరుగులు ఇవ్వడమేగాక ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇలాగే ఉంటే 156 కాస్తా 256 అవుతుంది.. దీనర్థం మిగతా మ్యాచుల్లోనూ అతను వికెట్లు తీయలేక ఎక్కువ పరుగులు ఇవ్వడమే. దీనిని ఉమ్రాన్ వీలైనంత తొందరగా కరెక్ట్ చేసుకోవాలి. స్పీడ్ ఒక్కటే ముఖ్యం కాదు.. లైన్ అండ్ లెంగ్త్ కూడా ముఖ్యమే” అని చెప్పుకొచ్చాడు.
That’s true💯#UmranMalik #RaviShastri #SRH #IPL2022 pic.twitter.com/bXmchmLpqs
— SportsCafe (@IndiaSportscafe) May 9, 2022
This man knows one way to bowl it seems!
SPEED!
SPEEDER!!
SPEEDIEST!!!#UmranMalik have bowled 156.9 KMPH on last match which is just behind #ShaunTait IPL record of 157.7 KMPH. Can he break it in Today’s game against #royalchallengersbangalore #SRHvsRCB #IPL #IPL2022 pic.twitter.com/VsiWoipJZW— The Crimofo Club (@TheCrimofoClub) May 8, 2022
ఇది కూడా చదవండి: RCB Vs SRH: బౌలింగ్ లోనే అనుకుంటే.. హైదరాబాద్ ఇప్పుడు ఫీల్డింగ్ లో కూడా చేతులెత్తేస్తోంది!
ఇక ఎస్‌ఆర్‌హెచ్ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఆరంభంలో రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికి.. ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలు సాధించి ఒక్కసారిగా టైటిల్ రేసులో వచ్చింది. 7 మ్యాచులు పూర్తయ్యేసరికి టాప్-2లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్.. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. అక్కడి నుంచి మళ్లీ హ్యాట్రిక్ పరాజయాలు చూసిన ఎస్‌ఆర్‌హెచ్ మొత్తంగా 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు.. ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఎస్‌ఆర్‌హెచ్ తన చివరి మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.
#SRH this season 😉😀#IPL2022 #OrangeArmy pic.twitter.com/qgseKGaOIk
— Vaali (@vaaalisugreeva) May 7, 2022
Can Umran Malik break Shaun Tait’s record for the fastest IPL delivery ❓ 💨
📸: Sport360#IPL2022 #IPL #TATAIPL #UmranMalik #SRH #Cricket #CricketTwitter pic.twitter.com/RhsrcGo8g4
— CricStats (@_CricStats_) May 8, 2022