ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా రానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ రాజకీయ రంగును పులుముకుంది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. కాగా.. ఇప్పుడు దీన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరుగా చూస్తామంటూ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు పేర్కొనడం చర్చకు దారితీస్తుంది. ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శనతో టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్1లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి నేరుగా ఫైనల్ చేరింది.
ఇక గుజరాత్ చేతిలో ఖంగుతిన్న రాజస్థాన్.. కీలక క్వాలిఫయర్ 2లో ఆర్సీబీని మట్టికరిపించి టైటిల్ ఫైట్‌కు సిద్దమైంది. మరోసారి గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ టైటాన్స్‌కు బరోడాకు చెందిన హర్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, రాజస్థాన్ రాయల్స్‌కి కేరళ కుర్రాడు సంజూ శాంసన్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే గుజరాత్‌లో కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడే. నరేంద్ర మోదీ రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీ ఫైనల్ చేరడంతో బీజేపీ మద్ధతుదారులతో పాటు మోదీ ఫ్యాన్స్, గుజరాత్ టైటాన్స్‌కి భారీగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతో ఆ పార్టీ కార్యకర్తలు రాజస్థాన్ గెలవాలని కోరుకుంటున్నారు.దీంతో ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను కాస్తా గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌గా కాకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మ్యాచ్‌గా అభివర్ణిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించి, గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే మోదీ వీరాభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా… రాజస్థాన్ రాయల్స్ విజయంతోనే కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలవుతుందని ఆ పార్టీ అభిమానులు బదులిస్తున్నారు. మొత్తానికి ఐపీఎల్ 2022 సీజన్‌కు రాజకీయ రంగు పూయడంతో సాధారణ అభిమానులు చికాకుకు గురవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: క్వాలిఫైయర్‌లో ఓటమి తర్వాత ఫ్యాన్స్‌కు విరాట్ కోహ్లీ మెసేజ్!
How Others See This Final
RR vs GT
How I See this Final
Congress Vs BJP
— 🅶🅷🅸🅻🅻🅸 🆁🅰🅹🚩🚩 (@Robert_Ghilli) May 29, 2022
Its GT vs RR
BJP VS CONGRESS 😆😆#IPLFinal #GTvsRR #RRvsGT pic.twitter.com/DOcsn0zbry— Uttam Mahamiya (@UMahamiya) May 29, 2022