ఐపీఎల్ లోని రీసెంట్ టైంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు అంటే గుజరాత్ టైటాన్స్ పేరు చెప్పొచ్చు. గతేడాది ఎంట్రీ ఇవ్వడంతోపాటు కప్ కొట్టేసింది. ఈసారి కూడా సేమ్ రిపీట్ చేసేలా కనిపిస్తుంది. కానీ ఆ జట్టుకు ఓ వీక్ నెస్ ఉంది. అదే ఇప్పుడు బయటపడింది.
ఐపీఎల్ లో బలమైన జట్లు పేరు చెప్పమంటే.. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ పేర్లు చెబుతారు. కానీ గుజరాత్ టైటాన్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఆ రెండింటి కంటే ప్రస్తుతం ఈ జట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంది. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ చేస్తున్న ఈ టీమ్.. గతేడాది లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతోనే ఏకంగా కప్ కొట్టేసింది. ప్రతి ఒక్కరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. అయితే వరస విజయాలతో దుమ్మురేపుతున్న గుజరాత్ విజయాలకు బ్రేక్ పడిందనే చెప్పాలి. ఈ జట్టుని ఓడిద్దామనుకునే ప్రత్యర్థి టీమ్స్ కు.. గుజరాత్ వీక్ నెస్ ఏంటో తెలిసిపోయింది!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మ్యాచ్ లో గుజరాత్ ఓడిపోయింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఈ పోరులో రాజస్థాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 177/7 స్కోరు చేసింది. ఛేదనలో రాజస్థాన్ జట్టు.. అద్భుతంగా పోరాడి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధనాధన్ ఆటకు తోడు సిక్సుల మోత మోగించిన హెట్మెయిర్.. రాజస్థాన్ విజయానికి కారణమయ్యాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. తాజా సీజన్ లో గుజరాత్ ఇప్పటివరకు 5 మ్యాచులాడితే.. అందులో మూడు గెలిచి రెండు ఓడిపోయింది. వీటిని సరిగ్గా గమనిస్తే.. గుజరాత్ బలహీనత ఏంటనేది అర్థమైపోతుంది.
చెన్నై, దిల్లీ, పంజాబ్ జట్లతో జరిగిన మ్యాచుల్లో గుజరాత్.. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడింది. ఛేదనలో కింగ్ అని నిరూపించుకుంది. కోల్ కతాతోపాటు తాజాగా రాజస్థాన్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ రెండింటిలోనూ ఓడిపోయింది. ఇదే కాదు గత సీజన్ లోనూ ఆర్సీబీ, పంజాబ్, సన్ రైజర్స్ చేతిలో.. ఇలానే తొలుత బ్యాటింగ్ చేసి ఓటమి చూసింది. దీన్నిబట్టి చూస్తుంటే.. గుజరాత్ ని ఫస్ట్ బ్యాటింగ్ చేయించినట్లయితే ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే గెలిచేయొచ్చు. లేదంటే మాత్రం గుజరాత్ గెలుపు గ్యారంటీ అని ట్రాక్ రికార్డు చూస్తుంటే అర్థమవుతోంది. మరి ఈ అబ్జర్వేషన్ గురించి మేం చెప్పాం కదా. మీకేం అనిపించింది. ఒకవేళ మీరు కూడా ఇదే అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
𝐌𝐚𝐭𝐜𝐡𝐝𝐚𝐲 𝐌𝐨𝐨𝐝 𝐁𝐨𝐚𝐫𝐝! 🔥#AavaDe | #GTvRR | #TATAIPL 2023 pic.twitter.com/UEOq2HEVOY
— Gujarat Titans (@gujarat_titans) April 16, 2023