ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తొలి మూడు మ్యాచ్‌లలో గెలుపు తర్వాత.. తొలి ఓటమిని చవిచూసింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ.. జట్టు గెలుపుకు ఆ పరుగులు సరిపోలేదు. ఇక మ్యాచ్ సంగతి పక్కన పెడితే.. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ క్రికెట్ అభిమాని.. అనవసరపు హెచ్చులుకు పోయాడు. హార్థిక్ పాండ్యాను తక్కువగా అంచనా వేసి.. ఒక విచిత్రపు పందెం కాశాడు.
పాండ్యా ఈ మ్యాచ్ 50 రన్స్ చేస్తే.. తాను ఉద్యోగం వదిలేస్తానని.. ప్లకార్డు పట్టుకుని షో చేశాడు. అతని దురదృష్టం కొద్ది.. గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ 5వ బంతికి హార్థిక్ 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆ అభిమాని ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాడు. పాండ్యా 50 కొట్టాడు.. మరీ నువ్వు ఉద్యోగం వదిలేశావా? అంటూ నెటిజన్లు అతన్ని ఆడేసుకుంటున్నారు. అన్న మాట ప్రకారం అతను జాబ్ వదిలేశాడో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో పాండ్యా ఫ్యాన్స్ దెబ్బకు మాత్రం తట్టుకుంటాడో లేదో? మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: SRH వరుస విజయాలు! కావ్య పాపపై ఐరెన్ లెగ్ ముద్ర!
— Sayyad Nag Pasha (@PashaNag) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.