శరీరంలోని చేతులు, కాళ్లపై ఉబ్బినట్లు కనిపిస్తోందా? అక్కడ టచ్ చేస్తే మెత్తగా ఉంటోందా? అది సాల్ట్ ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు. బాడీలోని కణజాలాల్లో ఎక్కువగా ద్రవాలు ఉండిపోతే ఇలా అవుతుంది. ఎక్కువ ఉప్పు తింటే అంటే 10గ్రా కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తం లో ఉండిపోతుంది దానివలన రక్తం గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు చేరుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తుంటాం. దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ లక్షణం కనిపిస్తున్నా ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకుంటే సరిపోతుంది.
ఉప్పు తగినంత తింటే మన ఆరోగ్యానికి ఏమీ కాదు. కానీ ఉప్పు మోతాదు మించితే మాత్రం మనకు అనారోగ్య సమస్యలు, హై బీపీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బులు,కిడ్నీ సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే నిత్యం మనం తగినంత మోతాదు కన్నా ఎక్కువ ఉప్పు తింటే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంటుంది. వాటిని బట్టి మనం ఉప్పు ఎక్కువగా తింటున్నామని గ్రహించాలి. ఆ మేర ఆహారంలో ఉప్పు తగ్గించాలి.
ఉప్పు అధికంగా తింటే నాలుకపై ఉండే రుచి కళికలు ఇతర రుచులను గుర్తించలేవు. దాని ఫలితంగా ఏది తిన్నా సహించదు. అంతేకాదు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలనిపిస్తుంది. ఉప్పు ఎక్కువగా తినేవారి శరీరంలో నీటి శాతం త్వరగా అయిపోతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి, నీరసం వస్తుంది.
మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఉప్పును తగ్గించుకోవడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పుతో పాటు పంచదార కూడా తగ్గిస్తే చాలా వరకు ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని అప్ డేట్స్ కోసం ఈ వీడియో వీక్షించండి: