వేసవి కాలంలో కూల్‌డ్రింక్స్, బీర్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. అయితే ఇలా బీర్లు విపీరతంగా తాగడం వల్ల పెను ప్రమాదం తప్పదు అంటున్నారు వైద్యులు. ఆ వివరాలు..
వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండి పోతున్నాయి. వేసవిలో దాహం అధికంగా ఉంటుంది. ఎన్ని నీళ్లు తాగినా.. దాహం తీరదు. దాంతో చాలా మంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్ట పడతారు. ఇక మందు బాబులు అయితే.. మండే ఎండల్లో చల్లగా ఉండే బీర్ తాగితే.. దాహం తీరుతుందని భావిస్తారు. ఇక వేసవి కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. ఇప్పటికే నగరంలోని మందు బాబులు కోటికి పైగా బీర్లు తాగేశారు. ఇక వేసవి పూర్తయ్యేసరికి.. ఎన్ని బీర్లు తాగుతారో చూడాలి. అయితే వేసవి కాలంలో బాడీని చల్లబర్చడం కోసం ఇలా బీరు తాగడం చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. వారు చెప్పిన వివరాలు ఏంటి అంటే..
సాధారణంగా బీరు తాగితే.. శరీరం కూల్‌గా మారుతుందని మందు బాబులు భావిస్తారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం అంటున్నారు వైద్యులు. పైగా బీరు తాగడం వల్ల.. శరీరం మరింత హీట్ ఎక్కుతుందని అంటున్నారు. పైగా శీతల దేశాల్లో.. వేడి కోసం ఆల్కహాల్ తాగుతారు. అందుకు కారణం.. దీని వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని అంటున్నారు. ఇక మందుబాబులు వారానికి కేవలం మూడు బీర్లు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. కాదని ఎక్కువ తీసుకుంటే పేగు చుట్టూ కొవ్వు ఏర్పడటం.. వంటి సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు.
ఇక వేసవిలో కొబ్బరి బొండాలు తాగడం శ్రేయస్కరం అని.. కొబ్బరి నీరు శరీరాన్ని చల్ల బరుస్తుంది అంటున్నారు. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు.. కొబ్బరి బొండాలు ఎక్కువగా తాగకూడదు అని వివరించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.