సాధారణంగా చాలామంది కొత్త జీవనశైలికి శ్రీకారం చుట్టేందుకు ఎల్లప్పుడూ రెడీగానే ఉంటారు. ఎలాగో 2022 మొదలైంది. కాబట్టి ఈసారి కొత్త లుక్ ఎందుకు ట్రై చేయకూడదు? అని ఆలోచిస్తుంటారు. అయితే చలికాలంలో చర్మ సంరక్షణ అనేది కొంచెం కష్టతరమే. ఎందుకంటే.. చలి కాలంలో మేకప్ కారణంగా ముఖం పై మొటిమలు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే చర్మం పొడిగా, రఫ్ గా మారుతుంది. ఇలాంటి సమయంలో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా అవసరం. ఈ సందర్భంగా శీతాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకునేందుకు రాత్రి వేళలో తీసుకోవాల్సిన బ్యూటీ టిప్స్ ఇప్పుడు చూద్దాం.
క్లీన్ ఫేస్(Clean Your Face):
చలికాలంలో ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఒకవేళ ముఖానికి మేకప్ వేసుకుంటే పడుకునే ముందు తప్పక మేకప్ తీసేయాలి. ఇలా చేస్తే చర్మంపై మురికి తొలగిపోయి ముఖంపై మొటిమల రాకుండా ఉంటుంది.
మాయిశ్చరైజ్(Moisturizer):
చలికాలంలో మీ చర్మాన్ని కాపాడుకోవడానికి కాస్త సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. రోజూ బయట పనులతో పొల్యూషన్ బారినపడి చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందుకే చలికాలంలో వారానికి రెండు మూడు సార్లు ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్ వేసుకుంటే మంచిది. దీని వల్ల చర్మం ఉత్తేజవంతంగా మారుతుంది. ప్రత్యేకంగా చలికాలంలో రాత్రివేళ మాయిశ్చరైజింగ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఐ క్రీమ్(Eye Cream):
చలికాలంలో ఎంత చక్కగా ముస్తాబైనా నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే.. కళ్లు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. మీ కంటి కింద నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు కళ్ల కింద ఐ క్రీమ్ రాయాలి.