దేశంలో చలితీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఉదయాన్నే కాలు బయటపెట్టలేని పరిస్థితి. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా అనారోగ్యం బారిన పడతారు. చర్మ సమస్య మొదలుకొని శ్వాస తీసుకోవడం, ఆస్తమా, జలుబు మరియు కొన్నిసార్లు కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి చలికాలంలో ఆరోగ్య చిట్కాలను పాటించడంతో పాటు శరీరాన్ని కాసింత వెచ్చగా ఉంచుకోవడం అవసరం. శరీరాన్ని అలా వెచ్చగా ఉంచే కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు, గాడ్జెట్లు మీకోసం..
చేతికి పని చెప్పకుండా ఏ పని చేయలేం. ఆఖరికి తినాలన్నా చేయి పెట్టాల్సిందే. దీనికి ప్రత్యామ్నాయంగా స్పూన్లు గట్రా ఉన్నా.. కొన్ని పనులకు మాత్రం చేతిని ఉపయోగించాల్సిందే. అలాంటి సమయాల్లో వాటర్ ప్రూఫ్ గ్లోవ్స్ ఉపయోగించడం ఉత్తమం. ఈ గ్లోవ్స్ ని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
దుప్పటి అవసరం అందరకి తెలిసిందే. చలికాలంలో దుప్పటి ఎంత నిండుగా కప్పుకున్నా.. ఎటువైపు నుంచో చలి పెడుతుంది అన్న భావన మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దీన్నించి కాపాడేది ఎలక్ట్రిక్ బ్లాంకెట్ మాత్రమే. ఇది కప్పుకుంటే వెచ్చగా ఉండడంతో పాటు.. హాయిగా నిద్రపడుతుంది. ఈ బ్లాంకెట్ ని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఎండాకాలంలో వేడి నుంచి కాపాడుకోవడానికి ఏసీలు ఉపయోగించే వారున్నారు కానీ, రూమ్ హీటర్లు ఉపయోగించే వారు చాలా తక్కువ. ఇవి గదిని వెచ్చగా ఉంచుతాయి. చలి నుంచి కాపాడుకోవడానికి చక్కటి ఉపాయం.. రూమ్ హీటర్లు. కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
చలికాలంలో అందరూ గోరువెచ్చని నీటిని తాగడానికి ఇష్టపడతారు. వేడి నీటిని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గొంతు సమస్యలు దరి చేరవు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జలుబు నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అలాగే ఈ స్టీల్ ఎలక్ట్రిక్ కెటిల్స్ ను టీ, కాఫీ తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
చలి ఎక్కువుగా ఉండడం వల్ల ఇంట్లోని బండలు(గ్రానైట్/టైల్స్) చాలా చల్లగా ఉంటాయి. కాలు కింద పెట్టాలంటే చలేమో అని ఆలోచిస్తుంటాం. ఈ సమయంలో ఫుట్ వార్మర్ చక్కగా ఉపయోగపడుతుంది. కాళ్ళు అందులో ఉంచి వెచ్చదనాన్ని పొందవచ్చు. కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ వాతావరణానికి చేతులు ఐస్ గడ్డల్లా చల్లగా ఉంటున్నాయి. ఏది ముట్టుకోవాలన్నా చలి పెడుతుందేమో అన్న భయం. గ్లోవ్స్ ధరించి చలిని తగ్గించిన వెచ్చదనం పొందలే. అదే ఈ హ్యాండ్ వార్మర్ అనుకోండి.. మీ చేతులం వెచ్చగా ఉంచుతుంది. అందులోనూ దీన్ని ఈజీగా క్యారీ చేయవచ్చు. కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఏ కాలంలోనైనా ఎలక్ట్రిక్ గీజర్లు ఉపయోగించడం సహజం. కాకుంటే.. చలికాలంలో వీటి అవసరం ఎక్కువుగా ఉంటుంది. అందులోనూ పోర్టబుల్ ఎలక్ట్రిక్ గీజర్ వల్ల బోలెడు ప్రయోజనాలు. వెంటబెట్టకెళ్తే.. ఎక్కడ కావాలంటే అక్కడ వేడి నీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
చలికాలంలో జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువుగా ధరిచేరుతుంటాయి. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఉపశమనం లభించినా కాసేపయ్యాక మళ్ళీ మొదటికే వస్తుంది. అదే.. వ్యాపరైజర్ ద్వారా ఆవిరి పట్టుకున్నామనుకోండి. వేడి గాలి లోపలికి వెళ్లి బాక్టీరియాను చంపడమే కాకుండా.. జలుబు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
వాటర్ హీటర్ ఉపయోగాలు అందరకి విదితమే. గీజర్ కొనలేని వారికి ఇదొక ప్రత్యామ్నాయం. వేడి నీటితో స్నానం చేయాలనిపించినపుడు ఒక ఐదు నిముషాలు వాటర్ హీటర్ పెట్టామనుకోండి.ఎలాంటి చలి బాధలు లేకుండా చకచకా స్నానం చేయొచ్చు. కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
గమనిక: ఇవి యూజర్ల అవగాహన కొరకు మాత్రమే. ఇది సరైనదా! కాదా! అన్నది వారి వ్యక్తిగత అభిప్రాయం. ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లు, వస్తువులు వినియోగించేటపుడు అప్రమత్తత అవసరం.