గ్యాస్ ట్రబుల్ ఈ పేరు చెప్పగానే అంతా భయపడిపోతారు. ఒక్కసారి గ్యాస్ ట్రబుల్ ఏర్పడితే జీవితంలో ప్రశాంతత ఉండదు. కోరుకున్న ఆహారాన్ని తినలేము. పది మందిలో ఫ్రీగా ఉండలేము. ఛాతిలో మంట. కడుపు ఉబ్బరం. ఇలా ఒకటేంటి ఎన్నో సమస్యలు. కానీ.., మీకు తెలుసా? ఎంత దీర్ఘ కాలికంగా ఉన్న గ్యాస్ ట్రబుల్ అయినా..కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తీసుకున్న ఆహరం ఆహార నాళం లోపలికి వెళ్లి, జీర్ణం అవుతుంది. ఆ తర్వాత చిన్న ప్రేగు నుండి శరీరంలోకి శోషణం అవుతుంది. ఈ పద్దతిలో లో కూడా మిగిలిపోయిన వ్యర్థం పెద్ద ప్రేగులోకి వెళ్తుంది. అక్కడ నుండి ఈ వ్యర్థం పాయవు ద్వారా బయటకి విసర్జించబడుతుంది. మన జీర్ణ వ్యవస్థలో ఇదంతా జరిగే సమయంలో కొన్ని ఆమ్లాలు విడుదల అవుతాయి.
ఇలాగే ఆహరం శోషణం అయ్యే సమయంలో, నీరు తీసుకున్న సమయంలో కొంత గాలి కూడా జీర్ణాశయాన్ని చేరుతుంది. ఇవన్నీ కూడా వాయువు రూపంలో పాయవు ద్వారా బయటకి పోవాల్సి ఉంటుంది. మల విసర్జన క్రమంగా జరిగినంత కాలం ఇదంతా ఓ క్రమ ప్రకారంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే .., ఎప్పుడైతే మలబద్దకం ఏర్పడుతుందో అప్పుడే ఈ గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది.
ఇక గ్యాస్ ట్రబుల్ కి అల్లోపతిలో ఉన్న రెమెడీస్ చాలా తక్కువ. డైమల్ సిరఫ్ గాని, యూనిమెంజైమ్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. అయితే.., ఇక్కడ ఇంకో విషయం గుర్తు పెట్టుకోండి. మెడిటేషన్ వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఈ విషయంలో అధికంగా మందులు వాడకపోవడమే మంచింది.గ్యాస్ ట్రబుల్ కి అల్లోపతిలో పెద్దగా మెడిసిన్ లేకపోయినా.., ఆయుర్వేదంలో మాత్రం అద్భుతమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి.
వీటిలో మొదటిది జిలకర, ధనియాల పొడి మిశ్రమం. జిలకర, ధనియాల మిశ్రమాన్ని నీటిలో కలిపి.. బాగా వేడి చేసిన తర్వాత కాస్త తేనె కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచి ఫలితం లభిస్తుంది. ఈ ద్రవం జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది. తద్వారా ప్రేగులు శుభ్రపడతాయి. అలాంటి సమయంలో మలం నిల్వ ఉండే స్థితి ఉండదు. కాబట్టి.. గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ లోకి వస్తుంది.
గ్యాస్ ట్రబుల్ కి రెండో హోమ్ రెమిడీ.. వాము, శొంఠి మిశ్రమం. ఉదయాన్నే వేడి నీటిలో ఈ మిశ్రమాన్ని వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. వాములో థైమాల్, క్యార్వ్ కాల్ అనే రెండు కెమికల్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఆమ్లాల స్థాయిని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి.. గ్యాస్ ట్రబుల్ అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది.