డబ్బు వెనుక పరుగులు పెడుతూ.. మనిషి తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఓవర్ టైమ్ అంటూ జీతంకోసం జీవితాన్ని రిస్క్‌లో పెట్టుకుంటున్నారు. సమయం, సందర్భం లేకుండా రోజులో ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకుంటున్నారు. కొందరు రోజులో రెండుసార్లే ఆహారం తీసుకుంటుంటే.. ఇంకొందరు నాలుగైదు సార్లు తింటున్నారు. అలా తక్కువగా తిన్నా, ఎక్కువగా తిన్నా కూడా శరీరానికి ముప్పే. తినే విషయంలో జాగ్రత్తగా లేకపోతే ముందుగా వచ్చే సమస్యలు మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు. వీటిని లైట్ తీసుకుంటే చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ సమస్యలను అధిగమించేందుకు చాలా చిట్కాలు కూడా ఉంటాయి. వంటింటి చిట్కాలను ఫాలోఅవుతూ ఈ సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు. మలబద్ధాకాన్ని అధిగమించేందుకు ఆహారపు అలవాట్లను మార్చుకుంటే సరిపోతుంది. తినే ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. గ్యాస్ట్రిక్ సమస్యను తప్పించుకోవాలి అంటే.. ముఖ్యంగా సమయానికి భోజనం చేయాలి. భోజనం చేసేందుకు వీలు లేకపోతే మంచినీళ్లు తాగాలి. ఒకవేళ ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే మసాలాలు, శనగపిండి పదార్థాలను దూరం చేసుకోవాలి. అయితే మలబద్ధంకం, గ్యాస్ సమస్యలను అధిగమించేందుకు శారీరక శ్రమ కూడా చేయాలి. ముఖ్యంగా యోగా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు యోగా ట్రైనర్ సాహితీ సూచించిన యోగాసనాలను ఈ కింది వీడియోలో చూడండి.