నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు మహిళలకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమన్ టీవీ సీఈవో మహిళలకు తన శుభాకాంక్షలు తెలిపారు.
స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, జీవం లేదు అసలు ఆమె లేకపోతే ఈ సృష్టే లేదు. సహనంలో ఆమె భూమాత, ప్రేమను పంచడంలో తల్లి, విద్యలో సరస్వతి, సాహసంలో రుద్రమ.. నీ జీవితంలో ఆమె సగం కాదు.. నీ జీవితమే ఆమె. మహిళ లేకపోతే.. అడుగడుగానా ఆమె సహకారం లేకపోతే ఈ సమాజ మనుగడ ప్రశ్నార్థకం. ఆమె మహిళ మాత్రమే కాదు.. ఈ ప్రపంచాన్ని సృష్టించి, నడిపించే ఓ అద్భుత శక్తి. ఆమె కాలు కదపకపోతే.. ఆ చేయి తిరగకపోతే కాలం స్థంభిస్తుంది. అలాంటి మహోన్నతమైన బాధ్యతలు నిర్వహిసోన్న మహిళా మూర్తుల త్యాగాలను, వారి సేవలను స్మరించుకోవడానికి ప్రతి ఏటా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నారు. నేడు అనగా బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా SumanTV (Owner & CEO) Suman Dudi వారికి శుభాకాంక్షలు తెలిపారు.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు.. అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు సుమన్ టీవీ వ్యవస్థాపకులు Suman Dudi (Founder, Chairman). చిన్న మొక్కగా ప్రారంభమైన సుమన్ టీవీ ప్రస్థానం నేడు మహా వృక్షమై.. డిజిటల్ మీడియాలో నంబర్ వన్‌గా కొనసాగుతోంది. నేడు వందల మందికి ఉపాధి కల్పిస్తూ.. మొత్తం 5కోట్ల 50 లక్షల నెట్వర్క్ సబ్ స్క్రైబర్స్ తో తన పరిధిని మరింత పెంచుకుంటూ.. డిజిటల్ మీడియాలో అగ్రగామిగా వెలుగొందుతోంది. సామాన్యుల పక్షాన నిలుస్తూ.. వారి సమ్యసలను ప్రజలు, ప్రభుత్వాల ముందుకు తీసుకెళ్తూ.. వారికి కొండంత భరోసాగా నిలుస్తోంది సుమన్ టీవీ. మరీ ముఖ్యంగా మహిళలకు పెద్దన్నలా అండగా నిలుస్తోంది.
ఇక సమాజంతో పాటు.. తమ సంస్థలో కూడా మహిళలకు పెద్ద పీట వేసే SumanTV (Owner & CEO) Suman Dudi.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. స్త్రీమూర్తులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. సుమన్ టీవీ అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది అని కొనియాడారు. ‘‘సుమన్ టీవీకి ఉన్న మొత్తం 5కోట్ల 50 లక్షల నెట్వర్క్ సబ్ స్క్రైబర్స్ లో మహిళల వాటా 60 శాతం కన్నా ఎక్కువగా ఉంది. మా సుమన్ టీవీ సాధిస్తోన్న విజయాల్లో మహిళల పాత్రే అధికం. మా సంస్థ అనే కాదే.. సమాజ అభివృద్ధిలో మహిళలే ప్రధానం. అలాంటి స్త్రీమూర్తులందరికి.. సుమన్ టీవీ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అని తెలిపారు Founder, Chairman & CEO – Suman Dudi.