యూట్యూబ్‌లో కొత్తగా ఛానల్ మొదలుపెట్టాలనుకునే వారికి ప్రముఖ డిజిటల్ టీవీ సుమన్ టీవీ ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. యూట్యూబ్ మాస్టర్ కోర్స్‌ను తీసుకువచ్చింది.
మన చేతిలో ఓ మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం మన చేతుల్లో ఉన్నట్లే. మర బుర్రల్లోని ఆలోచనల్ని పెట్టుబడిగా పెట్టి మొబైల్ ఫోన్‌తో అద్భుతాలను సృష్టించవచ్చు. మనలో ఉన్న ప్రతిభకు నలుగురిలో మంచి గుర్తింపు రావాలన్నా.. నాలుగు డబ్బులు సంపాదించాలన్నా.. సోషల్ మీడియాను మించిన ప్లాట్‌ఫాం లేదు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఎంతో మంది తమ ప్రతిభను నిరూపించుకుని సెలెబ్రిటీలు అయిపోతున్నారు. ఫేమ్‌తో పాటు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా సక్సెస్‌ను సాధిస్తున్నారు. ప్రముఖ డిజిటల్ టీవీ సుమన్ టీవీ యూట్యూబ్‌లో సక్సెస్ సాధించాలనుకునే వారికి 8 ఇయర్స్ సక్సెస్‌ఫుల్ జర్నీ ఇన్‌పుట్స్‌ను అందిస్తోంది. ఇందుకోసం యూట్యూబ్ మాస్టర్ కోర్స్‌ను తీసుకువచ్చింది. దీని గురించి తెలుసుకునే ముందు యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వంట మాస్టర్ వెంకటేష్ గురించి తెలుసుకుందాం. ఆయన 60 ఏళ్ల వయసులో యూట్యూబ్ ప్రస్థానాన్ని మొదలుపెట్టి స్వశక్తితో విజయం సాధించారు. లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం..
బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన వెంకటేష్ దాదాపు 40 ఏళ్లుగా వంట మాస్టర్‌గా పని చేస్తున్నారు. ఎన్నో శుభకార్యాల్లో రుచికరమైన వంటలు చేసి అందరితో వాష్‌వా అనిపించుకున్నారు. మరి, ఏమైందో ఏమో తెలీదు కానీ, ఆయన ఫంక్షన్లలో వంటలు చేయటం మానేశారు. కొత్తగా యూట్యూబర్ అవతారం ఎత్తారు. ‘ఫుడ్ ఆన్ ఫామ్’ అనే ఛానల్‌ను స్టార్ట్ చేశారు. తన ఫామ్‌లో ప్రకృతి మధ్యలో సహజ సిద్ధంగా వంటలు చేస్తూ వచ్చారు. ఫాంలో పండిన కూరగాయల్ని అప్పటికప్పుడు కోసి వంటలు చేస్తూ ఉంటారు. ఆంధ్రా-తెలంగాణ వంటలు చేస్తూ తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన వీడియోలను 7 కోట్లకు పైగా మంది చూశారు. వెంకటేష్ వంటమాస్టర్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. యూట్యూబర్ గానూ ఎంతో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా కోట్ల మందికి తన కొత్త కొత్త వంటలను పరిచయం చేస్తున్నారు. యూట్యూబ్‌లో విజయం సాధించాలనుకునే వారికి వెంకటేష మాస్టర్ ఓ స్పూర్తిగా నిలుస్తున్నారు.
మరి, మీరు కూడా వెంటకటేష్ మాస్టర్‌లాగా యూట్యూబ్‌లో సక్సెస్ సాధించాలని భావిస్తున్నారా?.. యూట్యూబ్‌లో కొత్తగా ఛానల్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారా? ఎలా మొదలుపెట్టాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే, మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్‌ఫుల్ జర్నీ ఇన్‌పుట్స్‌తో మీ కందిస్తున్నారు.. యూట్యూబ్ మాస్టర్ కోర్స్.. ఈ కోర్స్ ముఖ్యంగా నిరుద్యోగులు, గృహిణిలు, బిజినెస్ చేస్తున్న వారు, ఉద్యోగం చేస్తూ సెకండ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఉన్న చోటునుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్‌ప్రిన్యుర్‌గా తయారు చేయటమే మాలక్ష్యం.
యూట్యూబ్ మాస్టర్ కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.