హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో మహా శివరాత్రి అతి ముఖ్యమైనది. భక్తులంటే శివుడికి ప్రీతి. ఆయనంటే ఆ భక్తులకు నమ్మకం. అందుకే ఆ ఈశ్వరుడిని ప్రతి రోజూ స్మరిస్తారు. నిత్యం శివరాత్రి జరుపుకుంటారు. ప్రతి పక్షం, ప్రతినెల శివరాత్రి జరుపుకుంటారు. అలా భక్తులు ఏడాది పొడవునా శివరాత్రి జరుపుకుంటూ శివుడిని అభిషేకిస్తారు. అయితే వాటన్నింటీలో “మాఘ బహుళ చతుర్ధశి” నాడు వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది. అందుకే భక్తులంతా ఆరోజును “మహాశివరాత్రి”గా జరుపుకుంటారు. ఇప్పుడు కూడా మహా శివరాత్రి సమీపిస్తుండటంతో భక్తులు ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలకు సిద్ధమవుతున్నారు. అయితే స్వామికి పూజా క్రతువులో ముఖ్యమైన వాటిల్లో నైవేద్యం, జాగరణలు ప్రధానమైనవి. ఆ మహాశివుడిని పూజిస్తూ ఈ ఒక్కరోజు జాగారం ఉంటే ఎంతో పుణ్యం లభిస్తుంది.
మహాశివరాత్రిలో భాగంగా పూజలతో పాటు జాగారం అతి ప్రధానమైనది. అయితే చాలా మంది జాగరణ సమయంలో వారికి తెలియకుండానే అనేక తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పులు చేస్తే మహా పాపం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి జాగారం అంటే కేవలం రాత్రంతా మేల్కొని ఉండమే అని చాలా మంది భావిస్తారు. అందుకోసం సినిమాలు చూడటం. ఇది చాలా తప్పు అనే పండితులు చెబుతున్నారు. శివరాత్రి జాగారం అంటే శివ నామస్మరణ మాత్రమే చేయాలి. ఏ ఇతర ఆలోచనల మనస్సులోనికి రానివ్వకూడదు. పక్కంటి వారితో ఆటలు ఆడుతూ కూడా జాగరణ చేయరాదు. పిల్లలను, భార్యను/భర్తను దూషించరాదు.
రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియక పోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకలసంపదలు చేకూరుతాయని వారు చెబుతున్నారు. శివరాత్రి అంతా “ఓం నమః శివాయ” అనే పంచాక్షరీ మహామంత్ర స్మరణతో జాగరణ మనలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.