Maha Shivaratri 2023 Fasting Rules & Procedure in Telugu: పురాణాల ప్రకారం హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. దేవుళ్లల్లో మహాశివుడికి బోళా శంకరుడు అనే పేరు ఉంది. అంటే భక్తితో ఒక్కసారి తలుచుకున్నా కోరిక కోరికలు తీరుస్తాడని చెబుతారు. అలాంటి శివుడికి ఇష్టమైన రోజే ఈ మహాశివరాత్రి పర్వదినం.
హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో మహా శివరాత్రి అతి ముఖ్యమైనది. భక్తులంటే శివుడికి ప్రీతి. ఆయనంటే ఆ భక్తులకు నమ్మకం. అందుకే ఆ ఈశ్వరుడిని ప్రతి రోజూ స్మరిస్తారు. నిత్యం శివరాత్రి జరుపుకుంటారు. ప్రతి పక్షం, ప్రతినెల శివరాత్రి జరుపుకుంటారు. అలా భక్తులు ఏడాది పొడవునా శివరాత్రి జరుపుకుంటూ శివుడిని అభిషేకిస్తారు. అయితే వాటన్నింటీలో “మాఘ బహుళ చతుర్ధశి” నాడు వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది. అందుకే భక్తులంతా ఆరోజును “మహాశివరాత్రి”గా జరుపుకుంటారు. ఇప్పుడు కూడా మహా […]