కృష్ణా నది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉంది. దుర్గాదేవిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. ఎంతో కీర్తిగడించిన ఈ దుర్గామాత ఆలయం ఈ మధ్యకాలంలో వివిధ కారణలతో వార్తల్లో ఉంటుంది.
కృష్ణా నది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉంది. ఆమెను దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. అలానే ఈ అమ్మవారి ఆలయంలో చేసిన ప్రతిది ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినవే. ఇక ఇంద్రకీలాద్రి అనగానే గుర్తుకు వచ్చేది.. రాజా గోపురం. ఈ గోపురాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే తాజాగా ఈ దుర్గ గుడిలో ఓ జరుగుతున్న ఓ పరిణామం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది ఏమిటంటే.. గోపురంపై ఉన్న బంగారు కలశాలు నల్లగా మారిపోతున్నాయి.
దుర్గం గుడిలోని ఈ రాజగోపురం ఎనిమిదేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. అలానే ఈ గోపురంపై భారీ కలశాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో భక్తుల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విరాళాలు సేకరించారు. ఆ విరాళల వచ్చిన డబ్బులతో ఈ కలశాలను గోపురంపై ప్రతిష్టించారు. ఇవి ఏర్పాటు చేసి ఎనిమిదేళ్ల అయిందని, అప్పుడే వాటి రంగు మారడం ఏంటి అంటూ ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల దుర్గ దేవి గుడిలో వస్తున్న వార్తలతో అసలు ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతుందని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజగోపురంపై ఉండే బంగారు కలశాలు నల్లగా మారుతున్నాయి.
ఇంద్రకీలాద్రిపై దుర్గంగుడిలోకి వెళ్లే ప్రధాన ఆలయం వైపు ఉన్న ప్రవేశ మార్గం దగ్గర ఉన్న గోపురంపై రెండు దశాబ్దాల క్రితం కలశాలు ఏర్పాటు చేశారు. అయిన నేటికీ ఆ కలశాలు బంగారు వర్ణంతో విరాజిల్లుతుంది. అలా దుర్గం గుడి ప్రధాన ఆలయం ఘాట్ రోడ్డు వైపు ఉన్న ద్వారం వద్ద ఏర్పాటు చేసి ఈ కలశాలు రెండు దశబ్ధాలు అవుతున్నా చెక్కు చెదరనే లేదు. మరి రాజగోపురంపై కలశాలు ఏర్పాటు చేసి దశాబ్దం కూడా కాకుండా కాలేదు. అయితే రాజగోపురంపై ఉన్న కలశాలు ఎనిమిది ఏళ్లకే రంగు ఎలా మారాయి అంటూ అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. వైరల్ అవుతున్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.