తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. పచ్చడి, భక్ష్యాలు మాత్రమే కాక పంచాంగ శ్రవణానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.. ఏ రాశి వారికి కలిసి వస్తుంది అంటే..
జనవరి 1న కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కానీ హిందూ పంచాంగం ప్రకారం మాత్రం మనకు ఉగాది నాడే నూతన సంత్సరం, తెలుగు సంవత్సరాది ప్రారంభం అవుతుంది. ఇక ఈ ఏడాది మార్చి 21వ తేదీ, మంగళవారం నాడు ‘శుభకృత్’ నామ సంవత్సరం ముగిసి.. మార్చి 22న కొత్త ఏడాది శ్రీ ‘శోభకృత్’ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక ఈ తెలుగు ఏడాది.. 2023, మార్చి 21న ముగుస్తుంది. తెలుగు వారి 60 సంవత్సరాల్లో శోభకృత్ నామ సంవత్సరం 37వది. ఇక ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పంచాగ శ్రవణం చేస్తారు. ఈ సందర్భంగా ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
కొత్త ఏడాదిలో తమకు ఎలా ఉండబోతుంది.. కలిసి వచ్చే అంశాలు ఏంటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి జనాలకు ఆసక్తి ఉంటుంది. మరి ఉగాది తర్వాత మేష రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి.. ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి అనే దాని గురించి ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ప్రదీప్ జోషి.. సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వివరాలు వెల్లడించాడు.
మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో గురువు ఉంటాడు. ఏ రాశి వారికి అయినా ధనం, యోగం ఇచ్చేది గురువు. ఈ ఏడాది మేష రాశి వారు తప్పకుండ వివాహ ప్రయత్నాలు చేయాలి. చాలా కాలంగా వివాహం కాకుండా ఉన్న వారికి ఈ ఏడాది వివాహం అవుతుంది అని తెలిపారు. ఈ రాశి వారు శుభకార్యాలు, ఇంటి నిర్మాణం మీద ఖర్చులు చేస్తారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మీకు భవిష్యత్తులో కలిసి వచ్చే అంశాల మీద ఖర్చు చేయండి అని సూచించారు. శని మంచి స్థానంలో ఉంటాడు కాబట్టి.. వీరు ఇంటి నిర్మాణం చేపడతారు. ఈ రాశి వారు ఇప్పుడు ఇల్లు కట్టుకోకపోతే.. మళ్లీ నాలుగైదేళ్ల వరకు కట్టలేరు. కోర్టు కేసులు గెలుస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. లాభాలు కలుగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది అని తెలిపారు
మధ్యలో అప్పులు చేస్తారని.. అయితే తాహతుకు మించి అప్పులు చేయవద్దని.. వాటిని తీర్చుకునే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి అని తెలిపారు. అక్టోబర్‌లో గండాలు ఎక్కువ. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్నారు. అనురాధ నక్షత్రం వారికి ప్రయాణాల్లో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దైవారాధన బాగా చేయండి. గురు గ్రహానికి పూజ చేయడమే కాక.. ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే కలిసి వస్తుంది అని తెలిపారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.