మానవాళికి జన్మస్థానంగా భావించి పార్వతీదేవి యోనిని కోలిచే ప్రత్యేక ఆలయం అది. అక్కడి అమ్మవారి విగ్రహానికి సాధారణ స్త్రీలకు కలిగే రుతుస్రావం కలుగుతుంది. అది కూడా ప్రతి నెలలో మూడు రోజులు. ఇలాంటి ఎన్నో విశిష్టతలు కలిగిన కామాఖ్యదేవీ ఆలయం గురించి మీ కోసం.. ఆదిపార శక్తి కామాఖ్యదేవిగా అస్సాం రాష్ట్రంలోని గుహాటిలో కోలువైఉంది. ఇక్కడ యోని రూపంలో కోలువై ఉన్న దేవతను కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. దుష్టులను శిక్షించే త్రిపురభైరవిగా ఆనందంగా ఉన్నప్పుడు సింహా వాహిని అయి, పరమేశ్వరుడిపై అనుగ్రహంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారికి ఎర్రమందారాలు, తమర పువ్వులంటే ఇష్టం. భక్తులు అమ్మవారికి ఎక్కువగా ఈ పుష్పాలనే సమర్పిస్తారు. అమ్మవారి ఆలయ నిర్మాణం అంతా ఉత్తరాది పద్ధతిలోనే ఉంటుంది. ప్రధాన గోపురంపై బంగారు కలషం ఉంటుంది. ఈ ఆలయ ప్రముఖ్యతల్లో ప్రధానమైంది. అమ్మవారు ఇక్కడ యోని రూపంలో దర్శనమిస్తారు.
దీని వెనుక స్థలపురాణం ప్రచారంలో ఉంది. అల్లుడైన పరమశివుడిని పిలవకుండా తన తండ్రి దక్షప్రజాపతి యజ్ఞం చేయడమే కాకుండా తనను కూతురి చూడకుండా అవమానించడాన్ని సహించలేని సతీదేవి యజ్ఞగుండం లోనే అగ్నికి ఆహుతి అవుతుంది. దాంతో శివుడికి కోసం వచ్చి యజ్ఞాన్ని భగ్నం చేయమని వీరభద్రుడ్ని సృష్టించి పంపిస్తాడు. సతీదేవీ ఆత్మత్యాగాన్ని భరించలేని శివుడు ఆమె నిర్జీవదేహాన్ని భుజన వేసుకుని తిరుగుతుంటాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు పర్వతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. దాంతో ఆమె దేహం ముక్కలు భూమి మీద వివిధ ప్రాంతాల్లో పడతాయి. అందలో అమ్మవారి ప్రధాన భాగమైన యోని గుహాటి వద్ద నీలాచలంపై పడింది. ఈ పురాణ గాథకు సంబంధించిన శిల్పాలను ఆలయ ప్రాంగణం, ఆలయానికి వెళ్లే మార్గంలో చెక్కారు. మానవ సృష్టికి మూలమైన స్థానం కాబట్టి ఈ శక్తి పీఠం అన్ని పీఠాలోకెల్లా ప్రముఖ్యతను సంతరించుకుంది.
అందుకే ఈ పీఠాన్ని అన్ని పీఠాలకు ఆధార స్థానంగా భావిస్తారు. ఈ శక్తి పీఠాన్ని మహాయోగస్థలం అని పిలుస్తారు. ఆలయంలోని గర్భగుడిలో రాతి యోనిలోనే కామాఖ్యదేవి నివాసముంటుంది. దేవత కోరిక మేరకు తనను మోహపరవశుడిని చేసేందుకు వచ్చిన మన్మథుడిని ఈ నీలాచలంపైనే శివుడు దగ్ధం చేసినట్లు, తిరిగి రతీదేవీ కోరికమేరకు ఆమెకు మాత్రమే కనిపించేలా బతికించాడని స్థలపురాణం చెప్తుంది. ఇక్కడ సకల దేవతలు పర్వతరూపంలో ఉంటూ దేవతను సేవించుకుంటూ ఉంటారు. కామాఖ్యదేవి ఆలయ అధిష్టాన దేవత భైరవీ కామాఖ్యదేవీ అమ్మ ఎక్కడుంటే స్వామి కూడా అక్కడే ఉంటాడు. నీలాచలానికి తూర్పుభాగంలో బ్రహ్మాపుత్రా నది మధ్యలో వేంచేసి ఉన్నాడి స్వామి అందుకే మందిరం కింద నీటి ప్రవాహం ఉంటుంది. గర్భాలయంలోని అమ్మవారి యోని శిలా రూపం గుండా బ్రహ్మపుత్ర నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యోని స్రావితా జలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరించి, నెత్తిన చల్లుకుంటారు. అమ్మవారి యోని శిలారూపంపై తెల్లటి వస్త్రం కప్పి ఉంటుంది.
దానికి కారణం ఏంటంటే సాధారణ స్త్రీల మాదిరిగా అమ్మవారికి కూడా నెలలో మూడు రోజులు రుతుస్రావం అవుతుంది. మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారికి రుతుస్రవం జరిగే ప్రత్యేక రోజులు. దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల ప్రస్థావన స్పష్టంగా ఉంది. ఈ మూడు రోజుల్లో యోని శిల నుంచి ఎర్రటి స్రావం వస్తుంది. ఈ ఎర్రటి నీరే శక్తిపీఠం ముందు ఉన్న సౌభాగ్యగుండం నీరుగా చెప్తారు. రక్తస్రావం అయ్యే మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు. నాలుగో రోజు పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి ఆలయ తలుపుతు తెరుస్తారు. ఆలయ మూసే ముందే అమ్మవారి యోనిపై ఉంచమని వస్త్రాలు ఇస్తారు. నాలుగో రోజు ఆ వస్త్రాలను ఆలయ నిర్వాహకులు వేలం వేస్తారు. ఆ వస్త్రాలను భక్తులు పోటీపడి మరీ వేలంలో దక్కించుకుంటారు. ఆ వస్త్రాలు మనతో ఉంటే రుతుస్రావ దోషాలు దరిచేరవని నమ్మకం. ఆలయంలోని 12 గోపురాల మధ్య మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తి విగ్రహం ఉంటుంది. ఈ అమ్మవారిని హరగౌరి మూర్తి, భోగమూర్తి అని పిలుస్తారు.
ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు అంబుబాజి మేళా నిర్వహిస్తారు. దీన్నే సమాఖ్య కుంభమేళాగా పిలుస్తారు. ఈ శక్తి పీఠం ఎక్కువగా మంత్ర, తంత్ర, ఇంద్రజాలాలకు ప్రసిద్ధి. ఈ కామఖ్య ఆలయం ఎంతో పురాతనమైనది. 12వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కామ రూపాధిపతి ఎక్కడా ఆలయ ప్రస్తావన తీసుకురాలేదు. తర్వాతి రాజుల సశానాల ప్రకారం కామేశ్వరీ మహాగౌరి అమ్మవారు ఇక్కడ కొలువైనట్లు తెలుస్తుంది. 13వ శతాబ్దంలో కూచ్ బిహార్ రాజు విశ్వసిన్ యుద్ధంలో తన వాళ్లందరిని కోల్పోయి అమ్మవారిని పూజిస్తాడు. అతని కోరికలు తీరిన వెంటనే అమ్మవారికి గుడి కట్టేందుకు ఒక మట్టిదిబ్బను తవ్వుతుండగా అమ్మవారి యోని శిల బయటపడిందని దాంతో అక్కడ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది.