దేశంలో అనేక జీవనదులున్నాయి. ఈ నదులే భారత దేశ సస్యశ్యామలానికి కారణం. ఎత్తైన కొండల నుండి నీరు జాలువారు, వాగులు, వంకల నుండి ప్రవహించి, మైదాన ప్రాంతాలకు చేరి నదిగా మారుతుంది. అక్కడ నుండి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది.
భారత్‌లో అనేక నదులు ప్రవహిస్తున్నాయి. వాటికి ఉప నదులు అనేకం ఉన్నాయి. దేశంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ ఇవి ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే అనేక జీవనదులున్నాయి. ఈ నదులే భారత దేశ సస్యశ్యామలానికి కారణం. ఎత్తైన కొండల నుండి నీరు జాలువారుతూ, వాగులు, వంకల నుండి ప్రవహించి, మైదాన ప్రాంతాలకు చేరి నదిగా మారుతుంది. అక్కడ నుండి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. నీటి మీదే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. వ్యవసాయంలో నీరు కీలకం. నదీ జలాల మీద ఆధారపడి అనేక పంటలు పండుతున్నాయి. అయితే ఈ నదులను దేవతలుగా పిలుస్తూ.. వాటికి కూడా పూజలు చేస్తుంటారు హిందువులు. అందులో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అయితే దేశంలో ఉన్న జీవనదులన్నీంటికీ స్త్రీల పేర్లు ఉండటం గమనార్హం.
దేశంలో అతిపెద్ద నది గంగా నుండి గోదావరి, నర్మద, సింధు, తుంగభద్ర, తపతి వంటివి అందుకు ఉదాహరణ. అయితే దేశంలో మగ నది ఉందని చాలా మందికి తెలియదు. అదే బ్రహ్మపుత్ర నది. దేశంలో ఉన్న ఏకైక మగ నదిగా దీన్ని భావిస్తారు. ఈ నది ఎంతో పురాతనమైనది. పురాణాల ప్రకారం బ్రహ్మ పుత్రుడిగా దీన్ని భావిస్తారు. బుషి శంతనుడి భార్య అమోఘ అందానికి బ్రహ్మ మంత్రముగ్ధుడయ్యాడై, వివాహమాడాడని చరిత్రలో చెబుతారు. వారికి పుట్టిన బిడ్డ నదిగా మారి ప్రవహిస్తున్నాడని ఉవాచ. అందుకే దీనికి బ్రహ్మ పుత్ర అని నామకరణం వచ్చింది. చైనాలోని టిబెల్ మానస సరోవరంలో ఈ నది పుట్టింది. టిబెట్‌లో నైఋతిన యార్లుంగ్ నదిగా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయల గుండా పరుగులు తీస్తూ.. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుండి బంగ్లాదేశ్ వైపుగా ప్రవహిస్తుంది. భారతదేశంలో ఈ నది పొడవు 2900 కిలోమీటర్లు.
అయితే ఈ నది కూడా బంగ్లాదేశ్ నుండి ప్రవహిస్తూ చివరకు బంగాళా ఖాతంలో కలుస్తుంది. ఈ నదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో బ్రహ్మపుత్ర నదిలోని నీరు ఎర్రగా మారిపోతుంది. ఇది కేవలం మూడు రోజులు మాత్రమే అలా మారిపోతుంది. ఎక్కడంటే.. అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య దేవాలయం వద్ద ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ మాత్రమే ఈ నది ఎర్రగా మారిపోతుంది. ఈ మూడు రోజులు కామాఖ్య దేవి తన మాస చక్రంలో (నెలసరి) ఉంటుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ కారణంగా ఆ మూడు రోజులు ఆ నది ఎర్రగా మారిపోతుందని భావిస్తుంటారు. ఈ నదిని చూసేందుకు భక్తులు వస్తుంటారు.