మనిషి బతకడానికి కావాల్సిన అతి ముఖ్యమైనది.. ప్రధానమైనది డబ్బు. గాలి, నీరు, ఆహారం లేకపోతే.. ప్రాణం పోతుంది.. అలానే డబ్బు లేకపోయినా సరే ప్రాణం పోతుంది. అయితే మనలో చాలా మంది.. డబ్బు సంపాదన కోసం విపరీతంగా కష్టపడతారు. అయితే ఎంత చేసినా అనుకున్న ఫలితం మాత్రం పొందలేరు. మరి కొందరిని చూస్తే.. వారు పెద్దగా కష్టపడకపోయినా సరే.. డబ్బు దానంతట అదే వస్తుంది. మరి ఎందుకు ఇలా.. తేడా ఎక్కడ ఉంది అంటే.. వారి పేరులోని మొదటి అక్షరం వల్ల ఈ తేడా అంటున్నారు కొందరు జ్యోతిష్య నిపుణులు. మరీ ముఖ్యంగా ఎం అక్షరంతో పేరు ఉన్నవారు జీవితంలో ఎంతో అభివృద్ధి చెందుతారని.. వారు పట్టిందల్లా బంగారమే అంటున్నారు. మహేష్ బాబు, ముఖేష్ అంబానీ, మురళీమోహన్ తదితరులంతా ఈ కోవకే వస్తారని చెబుతున్నారు. ఇక వీరిలో మిగాతా వాళ్లతో పోలిస్తే.. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని.. అందువల్లే వారు.. జీవితంలో అభివృద్ధి చెందుతున్నారని వ్యాఖ్యానించారు.
ఎం అంటే.. మనీ.. డబ్బు. ప్రపంచాన్ని శాసించేది డబ్బు. ఎం అక్షరంతో పేరు ప్రారంభం అయ్యేవాళ్లు.. జీవితంలో అభివృద్ధి చేయాలంటే.. చేయాల్సింది ఒక్కటే. వారిలో ఉండే చిరుబద్ధకాన్ని వదిలేయాలి. ఒక్కసారి ప్రారంభించి.. రంగంలోకి దిగారా.. ఇక వారికి తిరుగుండదు. ఎందుకంటే మనలో చాలామంది.. ఏదో ఒక రంగంలో మాత్రమే స్థిరపడాలని ఆశిస్తారు. కానీ ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన వాళ్ల బుర్రలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రారంభం దోషం వల్ల కాస్త ఆలస్యం చేస్తారు. ఆ చిరుబద్దకాన్ని వదులుకుని రంగంలోకి దిగితే.. ఇక వారిని ఆపేవారుండురు అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.
ముఖేష్ అంబానీ, మహేష్ బాబు, మురళీమోహన్, మాధవీలత, సీనియర్ నటి మాధవి వంటి వారి జీవితాలను పరిశీలిస్తే.. ఈవిషయం అర్థం అవుతుంది. వారు కేవలం ఒక్క రంగంలోనే రాణించడం లేదు. ముఖేష్ అంబానీ వేలు పెట్టని రంగం లేదు. అలానే మహేష్ బాబు సినిమాలు, వ్యాపారం ఇలా విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. ఇక మురళీమోహన్ సినిమాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఎంత బాగా రాణిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయమే. అందుకే వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అని అంటున్నారు.
మరి ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన వీరు విజయం సాధించారు… కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పేర్లు ఎం అక్షరంతో ప్రారంభమవుతాయి. మరి వారు అందరూ ఎందుకు ఇలా విజయం సాధిచంలేదు అంటే.. అందుకు కారణం.. వారిలో ఉండే చిరు బద్ధకం అంటున్నారు.. 6జేవీఆర్ వ్యవస్థాపకులు లక్ష్మీగణపతి రావు. ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన వారు.. బద్దకాన్ని వదిలి.. వారి బుర్రలో వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టి.. కష్టపడితే.. ఇక వారికి తిరుగేలేదంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారిని కాస్త ప్రోత్సాహిస్తే.. చాలు.. ఇక వారు జీవితంలో వెనుదిరిగి చూడరని చెబుతున్నారు.