సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజూ పండుగలా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రమణ్య, రాఘవేంద్ర , వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు.
తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే. వరలక్ష్మీ వ్రతం కూడా ఈ నెలలోనే జరుపుకుంటారు. శ్రావణమాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి, ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ పూజను చేసుకుంటారు.
అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు. ఆ రోజున ఏదన్నా ఇబ్బంది వస్తుంద నుకునే వారు మొదటి శుక్రవారంనాడే వరలక్ష్మీ వ్రతాన్ని జరుపు కొంటారు. ఈ వ్రతవిధానాన్ని సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే, పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.
శ్రావణ శుక్రవారం గురించి మరిన్ని విశేషాలు …పాటించాల్సిన నియమాల గురించీ ఈ వీడియోలో వీక్షించండి: