విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నప్పటికీ భూమిపై ఉండే ప్రతి ఒక్కరూ చంద్ర గ్రహం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తారు. వెన్నెల రాత్రులు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.. అందుకే చంద్రుడిపై ఎంతో మంది కవులు తమ కవితలతో అద్భుతంగా వర్ణించారు. చిన్నప్పటి నుంచి అమ్మ గోరు ముద్దలు తినిపించేటపుడు చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ చంద్రుడి గురించి వర్ణిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు చంద్రుడిపై ఎన్నో పరిశోదనలు చేశారు.. చేస్తూనే ఉన్నారు. ఓ భార్య కోసం భర్త ఎప్పటికీ గుర్తుండిపోయేలా చంద్రుడిపై స్థలాన్ని కొని కానుకగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..
కంగ్రా జిల్లాకు చెందిన హరీశ్ మహాజన్ అనే వ్యక్తి తన భార్యకు జీవితంలో మధురమైన గిఫ్ట్ ఇవ్వాని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో చంద్రుడిపై స్థలాన్ని కొని తన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు. తన భార్య కోసం చంద్రుడిపై స్థలం కొనడానికి గత సంవత్సరం ఇంటర్నేషనల్ లునార్ ల్యాండ్స్ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియ ఏడాది వరకు కొనసాగింది.. మొత్తానికి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఆ సంస్థవారు మహాజన్ కి ఆన్ లైన్ లో పంపారు.
చంద్రమండలంపై స్థలం కదా.. ఖర్చు చేసిన డబ్బు ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. తన భార్య సంతోషం కోసం తాను చేసిన ఖర్చు పెద్దది కాదని అంటున్నారు మహాజన్. ఇక తన భర్త ఇచ్చిన కానుక చూసి ఆయన సతీమణి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి చంద్రమండలం స్థలం కొన్ని వ్యక్తుల్లో మహాజన్ రెండో వ్యక్తి. అంతకు ముందు ఉనా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి కోసం చంద్రుడిపై స్థలం కొనుగోలు చేశాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.