శ్రీరామ నవమి ప్రపంచ దేశాల్లో ఉన్న హిందులువులు భక్త శ్రద్దలతో జరుపుకునే పండుగ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మానవుడిగా శ్రీరాముడిగా అవతరించారు. శ్రీరామ నవమి రోజు శక్తికి తగినట్లుగా భక్తియుక్తులతో శ్రీరామచంద్రుని పూజిస్తారు. సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు.
ప్రపంచంలో ఉండే హిందులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ శ్రీరామ నవమి. ఈ పండుగ సందర్భంగా రామాలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మానవుడిగా శ్రీరాముడిగా అవతరించారు. ఒకే మాట.. ఒకే బాట అన్నట్టు సాగిన శ్రీరాముని జీవితం సకల జనులకు ఆదర్శం.
చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించడమే కాదు శ్రీరామ కళ్యాణం కూడా నేడు జరగడం విశేషం. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. ఇక శ్రీరామ నవమి రోజున వ్రతం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ఈ వ్రతం ఎలా ఆచరించాలంటే? శివ భక్తుడైన అగస్త్య మహర్షి సుతేష్ణ మహర్షితో వ్రత విధానం గురించి తెలియజేశారు. శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించాలి అనుకునేవారు కొన్ని ముఖ్య సూచనలు పాటించాలి. శ్రీరామ నవమి రోజున ఉదయం లేచి తల స్నానం ఆచరించాలి. ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్యం మూలన మనకు వీలైనంతలో మండపాన్ని ఏర్పాటు చేసి శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించిన చిత్రం లేదా సీతారాముడు, లక్షణ, హనుమాన్లు ఉన్న చిత్రపటాన్ని మండపంలో పెట్టి పూజించాలి.
పూజా సమయంలో పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంగాజలంతో స్వామివారికి పూజలు చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించి కర్పూర హారతి ఇవ్వాలి. స్వామి వారికి ఎర్రటి పూలు అంటే ఎంతో ప్రీతి.. అలాంటి పుష్పాలతో పూజచేస్తే మంచిది. స్వామి వారిని పూజించే ముందు హనుమంతుడికి పూజ చేయాలి. శ్రీరాముడికి సీతాఫలం అంటే ఎంతో ఇష్టం.. నైవేద్యంగా పెడితే మంచిది. పూజ సమయంలో తయారు చేసిన నైవేద్యం, పానకం, వడపప్పు స్వామి వారికి నిష్టగా సమర్పించి పూజించాలి. కుటుంబ సభ్యులు భక్తి శ్రద్దలతో స్వామి వారి మంత్ర జపం చేస్తూ ఉండాలి. అంతేకాదు పాలు, పండ్లను ఆహారంగా తీసుకొని ఆ రోజు మొత్తం స్వామి వారి మూలమంత్రాన్ని పఠిస్తూ అత్యంత నిష్టగా దీక్ష చేస్తే ఎంతో మంచింది.
శ్రీరామ నవమి రోజున భక్తిశ్రద్దలతో అన్నదానం చేసి.. గోవు, భూమి, నువ్వులు, బంగారం, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి స్వామి వారిని ఆరాదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని వేద పండితులు చెబుతున్నారు. ఈ విధంగా శ్రీరామ నవమి రోజున వ్రతం భక్తి శ్రద్దలతో చేసిన వారికి జన్మ జన్మాల పాపాలు నశించిపోతాయని, వారు కోరుకున్న విజయాలు దక్కుతాయని, కుటుంబం సుఖ సంతోషాలతో వర్థిల్లుతుందని.. అంతేకాదు ఈ వ్రత విధానం అందరికీ ఇహపరలోకాలలో భోగాన్ని మోక్షాన్ని కలిగిస్తుంది పండితులు చెబుతున్నారు.