భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటారు. రావణ సంహారం తర్వాత సీతా సమేతుడైన రాముల వారు అయోధ్యలో పట్టాభిషిక్తుడవుతారు. ఈ అపురూప ఘటన చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం. అదే రోజు తారాముల కళ్యాణం కూడా జరిగింది. తెలంగాణలోని భద్రాచలంలో ఈ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది.
శ్రీరాముడు సత్యపాలకుడు.. సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ధ హృదయుడు. రాజ్య సుఖాలు వదిలి తండ్రి మాటపై అడవులకు వెళ్లిన మహనీయుడు. అంతటి మహానుభావుడి బాటలో నడిస్తే.. మనకు సమాజంలో గౌరవం, ఉన్నత స్థానంతో పాటు సంపద కూడా మెండుగా ఉంటుందని పురాణ పురుషులు అంటున్నారు. రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల శుభ ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
మనలో చాలా మంది తరచుగా అబద్ధాలు చెబుతూ ఉంటారు.. ఎప్పుడు న్యాయంగా నిజాయితీగా ఉండటం మంచిది. అబద్ధాలు చెప్పటం వల్ల అప్పటి వరకు ఉపశమనం కలిగినా.. దాని పరిణామాలు తర్వాత ఘోరంగా ఉంటాయి. అందుకే అబద్దాలు చెప్పకూడదు.. ప్రతి ఒక్కరు కుటుంబంలో నిజాయితీ గా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలా ఉండటం వల్ల ఇంటా.. బయట మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు.
తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం వల్ల మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు అన్నట్లు చెప్పవచ్చు. తన తల్లిదండ్రులకు సోదరులకు, సోదరీమణులకు రాముడు మంచి ఆదర్శమూర్తిగా నిలిచాడు. ఆయన మార్గంలో నడిస్తే అన్నింటా విజయాలు సాధిస్తారు అని పెద్దలు అంటుంటారు. శ్రీరామనవమి రోజున చెడు అలవాట్లకు దూరంపెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట అన్ని శుభాలు జరుగుతాయని.. ఐశ్వర్యం, ఆనందం అన్నీ మీ వశమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.