తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్నారు. దేవుడు కరుణించాలంటూ డీహెచ్ ఖమ్మం జిల్లాలో విచిత్ర పూజలు జరిపిపాడు. స్థానిక ఎంపీపీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలో డీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పూనకం వచ్చిన ఈ మహిళా ఎంపీపీ చుట్టూ డీహెచ్ ప్రదక్షిణలు చేశారు. నిప్పుల్లో మిరపకాయలు, నిమ్మకాయలు వేస్తూ డీహెచ్ పూజలు చేశారు. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్ పర్యాటనలు చేస్తున్నారు.
కొత్తగూడెం నుంచి రాజకీయాలోకి వస్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో స్థానిక మహిళ ఎంపీపీ నిర్వహిస్తున్న ఈ పూజల్లో డీహెచ్ పాల్గొన్నారు. ఇక్కడ సాధారణం జరిగే పూజలే అయినప్పటికి..డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొనడం చర్చనీయాశంగా మారింది. పొలిటికల్ ఎంట్రీ కోసమే ఈ పూజల్లో పాల్గొన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. హెల్త్ డైరెక్టర్ గా ఉండి ఇలాంటి పూజలు చేయడం ఏంటని, శ్రీనివాస్ క్షుద్రపూజల తరహాలో ఈ పూజలు చేశారని కొందరు విమర్శిస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.