శ్రీరామచంద్రుల వారు ఎలా ఉండేవారో.. ఎంత అందంగా ఉండేవారో.. అన్న ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా..? ఏదో సినిమా సన్నివేశాల్లో కనిపించినట్లుగా ఊహించుకున్నారా..? అయితే మీ ఆలోచనా నిజమే కాదో ఇప్పుడే తెలుసుకోండి. శ్రీమహావిష్ణువు అవతారంగా చెప్పుకునే శ్రీరామచంద్రుల వారు యుక్త వయస్సులో ఎలా ఉండేవారో.. చిత్రాలు బయటకొచ్చాయి.
శ్రీరాముడి గురించి తెలియనివారుండరు. తండ్రి మాట జవదాటని వాడు. నిత్యము సత్యము పలికేవాడు. హిందూ మతానికి చెందిన వారు కాకపోయినా శ్రీమహావిష్ణువు అవతారంగా చెప్పుకునే శ్రీరామచంద్రుడి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అటువంటి శ్రీరామచంద్రుల వారు 21 ఏళ్ల వయసులో ఎలా ఉండేవాడు? ఈ ప్రశ్న చాలా మందిలో మెదిలే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సినిమా సన్నివేశాల్లో కనిపించినట్లుగా అందంగా ఉండేవాడని ఊహించుకొని ఉంటాం. కానీ అందుకు సమాధానం ఇప్పుడు దొరికింది. కృత్రిమమేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శ్రీరాముడు యుక్త వయసులో ఉన్న చిత్రాన్ని రూపొందించింది.
ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పరంగా బాగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. అన్ని రంగాల్లోకి ఇది క్రమక్రమంగా ప్రవేసిస్తోంది. రోబో సినిమాలో ‘ఓ మరమనిషీ.. మాలోకి రా..’ అని పాడుకున్నాం కదా. అలా మనం పాడుకున్నవిధంగానే మరమనిషి మనలోకి ప్రవేశిస్తున్నాడు. దీని గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే శారీరకంగా మనిషికి పుట్టకపోయినా మేధస్సుపరంగా దీనిది మనిషి పుట్టుకే. మనషిలాగే అన్ని పనులు చేస్తోంది.. ఆలోచిస్తుంది. ప్రవర్తిస్తోంది. పనిలోపనిగా యుక్త వయస్సులో శ్రీరామచంద్రుల వారి చిత్రాలను రూపొందించింది.
శ్రీరామచంద్రుల వారు ఎలా ఉండేవారో.. ఎంత అందంగా ఉండేవారో.. రామాయణం రచించిన కవులు వర్ణించటం చదివి ఉంటాం. రాముడి ఊహాజనితమైన ఫొటోలు ఎన్నో చూసి ఉంటాం. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన ఈ రూపాలు చూశాక.. ఇంత అందంగా ఉండేవారా..? అని అనిపించకమానదు. కృత్రిమ మేధ రెండు చిత్రాలను రూపొందించింది. మొదటి చిత్రంలో లార్డ్ శ్రీరామ్ ముఖ కవళికలు సాధారణంగా ఉన్నాయి. మరొక ఫోటోలో అతను నవ్వుతూ కనిపించాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రాలను ఎవరు రూపొందించారు అన్న దానిపై సమాచారం లేదు. ఈ చిత్రాలను చూశాక ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ దశరథ పుత్రుడిని మీరూ చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.