భగవంతునికి ఎన్నో నామాలున్నాయి. ఆయన వేయి నామాల విష్ణుదేవుడు కదా! అయినా గోవిందనామం చాలా ప్రశస్తమైనది. తిరుపతి యాత్రికులు శ్రీ వేంకటేశ్వరసామిని గోవిందనామంతోనే ఎక్కువగా కీర్తిస్తారు. గోవింద నామాంకితమైన మాలను ధరించి శ్రీ వేంకటేశ్వర వ్రతం ఆచరించే సంప్రదాయం ఏర్పడింది. ‘మాల’ అనే శబ్దానికి లక్ష్మిని కల్గించేది అని అర్థం. అంటే అశుభాలను తొలగించి సకల సంపదలను కల్గించేది మాల. శ్రీవేంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి.
కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టి.. ఆబట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి ముడుపు కడుతున్నారు. మనఃస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి, కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాటఇవ్వాలి, శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇవ్వాలి.
ముడుపు పని అయ్యే వరకు స్వామిముందే ఉండాలి. కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి. ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది. ఎవరైతే దీక్షాధారణ చేయదలచారో వారు స్వామికి ముడుపు కట్టి దీక్షను ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ దేవదేవుడు కాపాడగలడు.
వేంకటేశ్వరునికి ముడుపు ఎలా కట్టాలో మరిన్ని వివరాలు ఈ వీడియోలో వీక్షించండి: