“కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి తెలీకూడదు” అంటారు పెద్దలు. చిన్నప్పటి నుంచి ఈ మాటలనే చెబుతూ పిల్లలను పెంచుతుంటారు తల్లిదండ్రులు. ఇక దానం చేస్తే పుణ్యం వస్తుందని, ఈ పుణ్యం ద్వారా గత జన్మలో చేసిన పాపకర్మలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని హిందూ పురాణాలు చెబినట్లు.. ఎందరో పండితులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇతరులకు చేతనైనంత దానం, సహాయం చేయాలని ఆరాటపడుతుంటారు. అయితే అన్ని సమయాల్లో దానాలు చేయడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి అంటున్నారు పండితులు. మరి ఏ సమయాల్లో దానాలు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎదుటి వ్యక్తులు కష్టాల్లో ఉంటే సహాయం చేసేవారు, వారికి చేతనైనంత దానం చేసేవారు చాలా గొప్పవారు.. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే కొన్నికొన్ని అరుదైన సందర్భాల్లో దానాలు చేయకూడదు అని చెబుతున్నారు పండితులు. ఒక మనిషి జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే? అది జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు. ఈ ముగ్గులు ఓ మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన వారు. వారు మన జీవితాన్ని ఉన్నత స్థితిలో చూడాలని ఎప్పుడూ కోరుకుంటారు. అందుకే తల్లిదండ్రులు, గురువులు అప్పగించిన పని పూర్తి చేయకుండా ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు అని శాస్త్రాలు చెబుతున్నట్లు పండితులు చెబుతున్నారు. ఇక అతి ముఖ్యమైన మరో విషయం ఏంటంటే.. తల్లిదండ్రుల కర్మకాండల క్రతువులను నిర్వహించే క్రమంలో వాటిని పూర్తి చేయకుండా ఎలాంటి దానాలు చేయరాదని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నట్లు పండితులు పేర్కొంటున్నారు. ఇలా మధ్యలో క్రతువును ఆపి దానం చేయడానికి వెళ్లడం అనేది తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి చేకూరదంటున్నారు.
అయితే అసలు కర్మకాండలు చేసేదే తల్లిదండ్రుల ఆత్మ శాంతి కోసం అని మన పురాణాల్లో చెప్పకనే చెప్పారు. మరి అలాంటి కార్యాన్ని చేసే టైమ్ లో దానిని వదిలేసి వేరే దాన కార్యక్రమాల్లో పాల్గొనటం శస్త్రోక్తంగా సరైంది కాదన్నది పండితుల వాదన. ఇక ఈ సందర్భాల్లోనే కాకుండా మన ఇళ్లలో చాలా సందర్భాల్లో దానాలు చేసేటప్పుడు వారాలు, పండుగలు లాంటి ఇతర కారణాలతో దానాలు చేయం. ఇక తల్లిదండ్రులు, గురువులు చెప్పిన పనులు పూర్తి చేయకుండా దాన కార్యక్రమాల్లో పాల్గొంటే.. మహా పాపం అని పలువురు పండితులు చెబుతున్నారు. అయితే ఇక్కడ దానం చెయ్యోద్దని చెప్పడం లేదు. కానీ మనకు జన్మను ఇచ్చిన, బతుకునిచ్చిన తల్లిదండ్రులు చెప్పిన పని ముఖ్యం అని పండితుల వాదన. పైన తెలిపిన ముఖ్యమైన సందర్బాల్లో తప్పితే.. మిగతా సమయాల్లో దానాలు, సహాయాలు చేయవచ్చు. మనం బతకడంతో పాటుగా పది మందిని బతికించడంలోనే ఆనందం ఉంటుంది.