Krishna District: పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు పెద్దలు. కానీ కొందరు క్షణిక సుఖాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం పరాయి వ్యక్తుల మోజులో పడి పచ్చని సంసారంలో మంట పెట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాలతో పవిత్రమైన వివాహ బంధానికి మచ్చ తెస్తున్నారు.
తాజాగా ఓ మహిళ ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చేసింది. తీరా ఆ ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పెనమలూరుకు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత బీటెక్ క్లాస్ మేట్ ఆర్ఎస్ఐ విశ్వనాథపల్లి గణేష్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా పెళ్ళి చేసుకోవాలనుకునే స్టేజ్ కి దారి తీసింది. దానికి ఆ క్లాస్ మేట్.. ఆమె భర్తను వదిలేసి వస్తే పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు.
ప్రియుడ్ని గుడ్డిగా నమ్మిన ఆమె.. భర్తతో గొడవ పెట్టుకుని విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది. అయితే పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన గణేష్.. విడాకులు ఇచ్చిన తర్వాత హ్యాండ్ ఇచ్చాడు. దీంతో ఆమె దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ జాషువా విచారణకు ఆదేశించారు.
దీనిపై డీఎస్పీ రాజీవ్ కుమార్.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా గణేష్ తాను చేసిన నేరం ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై అత్యాచారంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. విచారణ అనంతరం అతడ్ని కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి బాధితురాలికి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: నడిరోడ్డుపై కామాంధుడి వికృత చేష్టలు..!
ఇది కూడా చదవండి: గర్భిణి అని చెక్ పోస్ట్ దాటివేత.. డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన మోడల్!