ఇటీవల కాలంలో దొంగతనాలు తగ్గాయి అనుకుంటే అంతలో ఏదో ఒక సంఘటన కలవరపాటుకు గురి చేస్తుంది. గతంలో ఇంట్లో ఎవ్వరూ లేని లేదా రాత్రి పూట యజమానులు నిద్రిస్తున్న సమయంలో దొంగతనాలకు పాల్పడేవారు చోరులు. కానీ నేడు పట్టపగలే దోచుకెళుతున్నారు.
ఇటీవల కాలంలో దొంగతనాలు తగ్గాయి అనుకుంటే అంతలో ఏదో ఒక సంఘటన కలవరపాటుకు గురి చేస్తుంది. గతంలో ఇంట్లో ఎవ్వరూ లేని లేదా రాత్రి పూట యజమానులు నిద్రిస్తున్న సమయంలో దొంగతనాలకు పాల్పడేవారు చోరులు. కానీ నేడు పట్టపగలే దోచుకెళుతున్నారు. అంతేకాదూ ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడటం లేదు. నగలు, డబ్బులు, అందిన కాడికి వస్తువులు దోచేస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఈ దొంగతనాల్లో కూడా ట్విస్టులు నెలకొంటున్నాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టడు అన్నట్లు.. బాగా తెలిసి వాళ్లే దొంగతనాలకు పాల్పడటం ఆశ్చర్యకరం. తాజాగా ఇటువంటి ఘటనే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది.
మచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రముఖ పిల్లల వైద్యుడు డా. ఉమా మహేశ్వరరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య డాక్టర్ రాధను అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపేశారు ఆగంతకులు. ఆమె ఒంటిపై ఉన్న నగలతో పాటు ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులతో దోచుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. క్లినిక్ కు వెళ్లిన తర్వాత భార్యకు ఆయన ఫోన్ చేయగా..ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె రక్తపు మడుగుల్లో పడి ఉంది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరరావు, రాధ భార్యాభర్తలు. వీరిద్దరూ డాక్టర్లే. జవార్ పేటలోని శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ పేరుతో తల్లి పిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు. ఆ చుట్టూ పక్కల ఉమా మహేశ్వరావుకు మంచి పేరుంది.
అయితే మంగళవారం సాయంత్రం కింది ఫ్లోర్‌లోని క్లినిక్‌కి వెళ్లారు ఉమామహేశ్వరావు. రాత్రి 11 గంటల సమయంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య రాధ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి వెళ్లి చూడగా రాధ రక్తపు మడుగులో పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. ఇది దొంగల పనేనని, ఇంట్లో చొరబడి భార్య రాధను కిరాతకంగా చంపేసి, ఆమె ఒంటిపై నగలు, ఇంట్లో బంగారాన్ని తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది దొంగల పనా.. లేక హత్య చేసి దొంగతనమని సృష్టిస్తున్నారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. అయితే ఫోన్లు సీజ్ చేయగా.. భర్త పలుమార్లు ఫోన్లు అడగటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.