ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆడవారిపై కామాంధుల అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆడవారు కనిపిస్తే చాలు.. వయసుతో సంబంధం లేకుండా మృగాళ్లా రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. ఇలాంటి వారిలో మాత్రం మార్పురావడం లేదు. ఓ మహిళ పట్టపగలు ఒంటరిగా రోడ్డుపై వెళ్తుంటే.. వెనుక నుంచి ఓ కామాంధుడు వచ్చి వికృత చేష్టలు చేశాడు.. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ఈ దారుణమైన ఘటన పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంది.. ఆ సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేరు. అంతలోనే ఓ వ్యక్తి మహిళ వెనుక నుంచి అకస్మాత్తుగా వచ్చి తాక రాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ కామంధుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆ తర్వాత అతడు ఆమెను పక్కకు నెట్టి అక్కడ నుంచి పరార్ అయ్యాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో పాక్ రిపోర్టర్ హమీద్ మీర్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇలాంటి నింధితులను పట్టుకొని వెంటనే కఠినంగా శిక్షించాలని.. లేదంటే ఒంటరిగా మహిళలు ఎక్కడికైనా వెళ్లాలంటే భయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. అయినప్పటికీ సోషల్ మీడియా వస్తున్న విమర్శలతో ఫిర్యాదు స్వీకరించామని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
ఇది చదవండి: పెళ్లికి నిరాకరించిన యువతి.. స్నేహితులతో కలిసి యువకుడు అత్యాచారం!
سیکٹر آئی 10 اسلام آباد میں حوس کے پجاری درندہ صفت شخص کی حرکت دیکھیں ۔
حکام اس پر پوری نوٹس لے۔
@ICT_Police
By @IslamabadNewz— Zobia Khurshid Raja (@ZobiaKhurshid) July 18, 2022