బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. యువతి పెళ్లికి నిరాకరించిందని యువకుడు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్ సితామర్హి జిల్లాలోని ఓ గ్రామం. ఇక్కడే తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్న 22 ఏళ్ల యువతికి స్థానికంగా మహ్మద్ కైఫ్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ పరిచయంతో కాస్త చనువుగా మెలిగిన మహ్మద్ కైఫ్ ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. దీంతో ఆ యువతికి మాయమాటలు చెప్పిన ఆ యువకుడు ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు.
కొంత కాలం తర్వాత శారీరక కోరికలు కూడా తీర్చుకున్నాడు. అయితే ఇక ఎలాగైన పెళ్లి చేసుకోవాలని ఆ యువతి వెంటపడ్డాడు. కానీ ఆ యువకుడి తీరు నచ్చని ఆ మహిళ అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో కోపంతో రెచ్చిపోయిన ఆ వక్తి పెళ్లి చేసుకోవాలంటూ పదె పదె బలవంతం పెట్టాడు. అయినా సరే ఆ యువతి అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో స్నేహితుల ముందు అవమానంగా భావించిన ఆ యువకుడు ఆమెపై పంగపెంచుకున్నాడు.
ఇది కూడా చదవండి: నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. చివరికి విషాదం ఏంటంటే?
ఇందులో భాగంగానే జూన్ 24న ఆ యువతిని నమ్మించి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. మహ్మద్ కైఫ్ ముందుగానే తన స్నేహితులకు చెప్పి ఓ చోటకు రమ్మని చెప్పాడు. దీంతో వారంతా గుట్టుచప్పుడు కాకుండా వాళ్లిద్దరున్న ప్రాంతానికి వచ్చారు. ఇక రెచ్చిపోయిన మహ్మద్ కైఫ్ తన స్నేహితులతో కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ యువతికి మరుసటి రోజు మెలుకువ వచ్చింది. వెంటనే ఇంటికి చేరుకుని తనపై జరిగిన దారుణాన్ని పూసగుచ్చినట్లు తల్లిదండ్రులకు వివరించింది.
ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల వరకు వెళ్తే పరువు పోతుందని భావించిన గ్రామ పెద్దలు యువతికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ రోజులు గడుస్తున్నా ఆ యువతికి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.