ఆమె పేరు పుష్ప. బుధవారం బట్టలు ఉతుకుతానని భర్తకు చెప్పి కాలువ వద్దకు వెళ్లింది. సరేనంటూ భర్త వెళ్లమన్నాడు. ఇక చాలా సమయం అయినా భార్య ఇంటికి రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందంటూ భర్త కాలువ వద్దకు వెళ్లాడు. భర్త అక్కడికి వెళ్లి భార్యను చూడగా ఊహించని స్థితిలో కనిపించింది. భార్యను భర్త అలా చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాని భర్త.. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామం. ఇక్కడే కురుమూర్తి, పుష్ప(32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే బుధవారం గ్రామానికి సమీపంలోనే ఉన్న బీమా పేస్ కెనాల్ కాలువ వద్దకు బట్టలు ఉతికేందుకు పుష్ప కూతురు వెళ్లారు. ఇక కొద్దిసేపు తల్లి వద్ద ఉన్న కూతురు మరల ఇంటికి వచ్చింది. అయితే సాయంత్రం దాటింది. అయినా భార్య ఇంకా ఇంటికి రాలేదు. ఎందుకు భర్త కురుమూర్తికి అనుమానం వచ్చింది. ఏం జరిగిందని తెలుసుకోవడానికి భర్త కెనాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఒడ్డున భార్య చెప్పులు, బట్టలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడికి వెళ్లిందని భర్త అంతటా వెతికాడు. భార్య ఆచూకి మాత్రం దొరకలేదు.
కానీ ఎందుకో భర్తకు భార్య బట్టలు ఉతికే క్రమంలో కాలుజారి ఆ కెనాల్ లో పడిపోయిందనే అనుమానం తట్టిలేపుతుంది. దీంతో వెంటనే భర్త పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించాడు. ఇక పోలీసులు స్థానికుల ఏకంగా రెండు గంటల పాటు శ్రమించగా చివరికి పుష్ప శవం బయటపడింది. అనంతరం కెనాల్ లో నుంచి పుష్ప శవం బయటకు తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ కెనాల్ లో నుంచి తీసిన భార్యను భర్త అలా చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.